Last Updated:

Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలికి తేలు కాటు

ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా దిగిన తర్వాత సిబ్బంది విమానంలో క్లీనింగ్‌ ప్రక్రియను చేపట్టారు. దీంతో విమానంలో ఉన్న తేలును గుర్తించారు.

Air India: ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలికి తేలు కాటు

Air India: ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికురాలికి తేలు కుట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్ నుంచి ముంబై వెళుతున్న ఎయిరిండియా విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ 23 వ తేదీన నాగపూర్ నుంచి ముంబైకి AI 630 విమానం బయలు దేరింది. అయితే మార్గ మధ్యంలో ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు ప్రయాణికురాలు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

 

అలెర్ట్ అయిన ఎయిరిండియా(Air India)

ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా దిగిన తర్వాత సిబ్బంది విమానంలో క్లీనింగ్‌ ప్రక్రియను చేపట్టారు. దీంతో విమానంలో ఉన్న తేలును గుర్తించారు. విమాన ప్రయాణంలో తేలు గుర్తించడంలో ఎయిరిండియా అలెర్ట్ అయింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు చేపట్టాలని, క్రిమికీటకాలు లేకుండా చూడాలని కేటరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు సంస్థ సూచించింది. గత ఏడాది డిసెంబర్‌లో కూడా ఇదే విధంగా కాలికట్‌ నుంచి దుబాయ్‌ వెళుతున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కార్గోలో పామును గుర్తించిన విషయం తెలిసిందే.