Home / అంతర్జాతీయం
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం నూనెను జెరూసలెంలో పవిత్రం చేసినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ శుక్రవారం ధృవీకరించింది. మే 6 న 74 ఏళ్ల రాజు మరియు 75 ఏళ్ల రాణిని అభిషేకం చేయడానికి ఉపయోగించే నూనెను శుక్రవారం ఉదయం జెరూసలెంలోని చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్ వద్ద పవిత్రంగా ఉంచాని ప్యాలెస్ వెల్లడించింది.
రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్ V ను రూపొందించడానికి సహాయపడిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బొటికోవ్,అతని అపార్ట్ మెంట్లో బెల్టుతో గొంతు కోసి చంపబడ్డాడు. హత్యకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
: యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. వాటిలో మందుగుండు సామగ్రితో పాటు ట్యాంకులు, మిలిటరీ వాహనాలు ఉన్నాయి.
ఇండోనేషియాలో శుక్రవారం నాడు చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు
ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఫీవర్ కనిపిస్తోంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్ ఉండటం విశేషం.
నైజీరియా యొక్క నైజర్ డెల్టా ప్రాంతంలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగార స్థలం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 12 మంది మరణించారు, అయితే స్థానిక నివాసితులు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
ప్రతి ఏట మార్చి 4 న ప్రపంచ స్థూలకాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయం గురించి చర్చించుకునేందుకు.. దానిపై అవగాహన కల్పించేందకు ఈ రోజును జరుపుతున్నారు.
WTC Final: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో జూన్ 7న ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది.
దాదాపు రూ. 999 కోట్లు విలువ చేసే ఈ ఎస్టేట్ ను రష్యా బడ్జెట్ నిధుల నుంచి అక్రమంగా డబ్బులు తరలించి నిర్మించినట్టు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని అత్యంత సంపన్నులు గత ఏడాది అంటే 2022లో పది శాతం సంపద కోల్పోయారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.