Home / అంతర్జాతీయం
సూడాన్‌లో కొనసాగుతున్న ఘర్షణల్లో 400 మందికి పైగా మరణించగా 3,351 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. దేశ సైన్యం మరియు పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగా ఇతర దేశాలకు చెందిన పలువురు చిక్కుకు పోయారు. వీరిని అక్కడనుంచి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తామని నమ్మిన క్రైస్తవ మతానికి చెందిన వారిగా భావిస్తున్న 51మంది మృతదేహాలను కెన్యా పోలీసులు వెలికితీశారు.తీర ప్రాంత పట్టణం మలిండి సమీపంలో పోలీసులు శుక్రవారం షాకహోలా అటవీప్రాంతం నుండి మృతదేహాలను వెలికి తీయడం ప్రారంభించారు
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే తుంటరి పనులకు కేరాఫ్ అడ్రస్. ఆయన వ్యాఖ్యలే కాదు.. చేసే పనులు కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి.
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ తాజాగా బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ రుసుము చెల్లించని కారణంగా.. సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల..
ఉక్రెయిన్‌తో యుద్ధం ఉన్నప్పటికీ రష్యాలోని అత్యంత సంపన్నుల సంపద గత ఏడాది కాలంలో 152 బిలియన్ డాలర్లు పెరిగిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సహజ వనరులకు పెరిగిన ధరల కారణంగా బిలియనీర్ల సంఖ్య సంపద పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే వారు అదృష్టవంతులయ్యారు.
20 మందికి పైగా జర్మన్ దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు రష్యా శనివారం ప్రకటించింది. తమ దౌత్య సిబ్బందిని జర్మనీ బహిష్కరించినందుకు బదులుగా ఈ చర్యతీసుకుంది. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మాట్లాడుతూ 20 కంటే ఎక్కువ జర్మన్ దౌత్యవేత్తలు బయలుదేరవలసి ఉంటుందని చెప్పారు.
స్కాట్లాండ్ తీరంలో జనావాసాలు లేని ద్వీపం అమ్మకానికి ఉంది, దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు కంటే ఎక్కువ. 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బార్లోకో ద్వీపం డంఫ్రైస్ మరియుగాల్లోవేలోని కిర్క్కుడ్బ్రైట్ నుండి రోడ్డు మార్గంలో దాదాపు తొమ్మిది మైళ్ల దూరంలో ఉంది.
కాగా జీ20 సమ్మిట్ లో భాగంగా బైడెన్ భారత్ పర్యటనకు రావడం ఇదే మొదటి సారి. ఆయన తో పాటు అమెరికా మంత్రులు జానెత్ యెల్లెన్, గినా రైమోండో
శ్రీహరికోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేసిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సి55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్ ప్రక్రియ.. నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్ఎల్వీ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.