Home / అంతర్జాతీయం
Japan: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ పేలుడుపై అధికారులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. డెయిరీ ఫామ్ లోని మిషన్స్ బాగా వేడెక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
నాలుగో దశ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స సమయంలో 90 శాతం నాలుకను తొలగించినప్పటికీ, బ్రిటిష్ మహిళ మళ్లీ మాట్లాడటం ప్రారంభించింది. జెమ్మా వీక్స్ (37) అనే మహిళ గత ఆరేళ్లుగా తన నాలుకతో సమస్యలు ఉన్నాయని చెప్పారు.
ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ జెర్రీ హాల్‌తో తన వివాహాన్ని ఆమెకు ఇమెయిల్ ద్వారా 11 పదాల వాక్యంతో ముగించాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఆయన విడాకులు తీసుకున్నారని వానిటీ ఫెయిర్ మ్యాగజైన్ నివేదించింది.
ఏఐ ఆధారిత చాట్‌బాట్ బార్డ్, జీ మెయిల్, గూగుల్ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఉత్తర కొరియాలో అధ్వాన్నంగా ఉన్న ఆర్థిక పరిస్థితి దాని పౌరులపై, ముఖ్యంగా శ్రామిక వర్గంపై పడుతోంది. కొంచెం సులభంగా మరియు త్వరగా డబ్బు సంపాదించడానికి, దేశంలోని ఫ్యాక్టరీ కార్మికులు ఉపకరణాలు, విడిభాగాలు మరియు ఇతర వస్తువులను దొంగిలించడం ప్రారంభించారు
: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన నివేదిక ప్రకారం, మార్చి మధ్యలో చైనాలో H3N8 బర్డ్ ఫ్లూ యొక్క మొదటి కేసు నమోదయింది. 56 ఏళ్ల మహిళ పక్షులలో కనిపించే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా యొక్కవ్యాధి బారిన పడి చైనాలో మరణించిన మొదటి వ్యక్తి కావడం గమనార్హం.
మయన్మార్ పాలక జుంటా ప్రభుత్వం మంగళవారం ఒక గ్రామంపై వైమానిక దాడిని నిర్వహించినట్లు ధృవీకరించింది, ఇందులో చాలా మంది పిల్లలు మరియు విలేకరులతో సహా కనీసం 100 మంది మరణించారు.
జంతువులు కూడా ఆల్కహాల్ వ్యసనానికి గురవుతాయా? అంటే అవుననే చెప్పాలి. యూకే లోని డెవాన్లోని వుడ్‌సైడ్ యానిమల్ రెస్క్యూ ట్రస్ట్, కోకో అనే కుక్క మద్యానికి బానిసైన వింత కేసును చూసింది.
'జీరో-కోవిడ్' విధానంలో ఆకస్మిక సడలింపు నేపధ్యంలో మూడేళ్ల తర్వాత చైనాలో సరిహద్దు ప్రయాణాన్ని పూర్తిగా పునరుద్ధరించడం దేశంలోని యువతకు వరంగా మారుతోంది. చైనీస్ ఎయిర్‌లైన్స్ తమ అతిపెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. దీనితో క్యాబిన్ క్రూ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు పోటెత్తారు.