Home / అంతర్జాతీయం
రష్యా కీలక భవనాలు ఉండే క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది.
ఒక్లహోమాలో జైలు నుండి విడుదలైన లైంగిక నేరస్థుడు తన భార్యను, ఆమె ముగ్గురు పిల్లలను మరియు వారి ఇద్దరు స్నేహితులను తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు, ఓక్ముల్గీ పోలీస్ చీఫ్ జో ప్రెంటీస్ మాట్లాడుతూ, ఓక్లహోమా గ్రామీణ ప్రాంతంలో సోమవారం మృతదేహాలను కనుగొన్నామని తెలిపారు. బాధితులను 9 ఎంఎం పిస్టల్‌తో వారి తలపై ఒకటి నుండి మూడు సార్లు కాల్చాడని చెప్పారు.
పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని ఆరోపించిన వెంటనే దాడుల జోరును పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రెండు దేశాలూ పోటాపోటీగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ కుట్ర పన్నినట్లు క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. గత రాత్రి డ్రోన్ల ద్వారా క్రెమ్లిన్‌పై దాడులు జరిగాయని, అయితే పుతిన్ మాత్రం సురక్షితంగా ఉన్నారని.. తన పనులు తాను చేసుకుంటున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సెర్బియా లోని బెల్గ్రేడ్ పాఠశాల తరగతి గదిలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది విద్యార్దులు, ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఒక ఉపాధ్యాయుడు, ఆరుగురు విద్యార్దులను ఆసుపత్రిలో చేర్చారు.
ఉత్తర మరియు పశ్చిమ రువాండాలో వరదల కారణంగా కనీసం 109 మంది మరణించారని స్థానిక అధికారుల గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్వహణలోని రువాండా బ్రాడ్‌కాస్టింగ్ ఏజెన్సీ (ఆర్బీఏ) తెలిపింది.నిన్న రాత్రి కురిసిన వర్షం ఉత్తర మరియు పశ్చిమ ప్రావిన్స్‌లలో విపత్తుకు కారణమైందని ఆర్బీఏ తన వెబ్సైట్లో తెలిపింది.
మూడు సంవత్సరాల కోవిడ్-19 నియంత్రణలు ఎత్తివేయడంతో చైనాలో పర్యాటకుల తాకిడి పెరగింది. . పర్యాటకుల రద్దీని తట్టుకోలేక హోటళ్లు మరియు టూరిస్ట్ హాట్స్పాట్లు కిక్కిరిసి పోతున్నాయి
యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మెక్సికో సరిహద్దులో 1,500 అదనపు దళాలను మోహరించాలని యోచిస్తోంది.వచ్చే వారం కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయబడినప్పుడు వలసదారుల తాకిడి పెరుగుతుందని భావించిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఆసియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా పెరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకను కూడా మించిపోయింది. దీనికి ప్రధాన కారణం డాలర మారకంతో స్థానిక కరెన్సీ బలహీనపడ్డంతో పాటు ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంపై పడింది.
బ్రిటన్ లో దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. గత ఏడాది క్వీన్ ఎలిజబెత్-2 మరణించిన విషయం తెలిసిందే.