Home / అంతర్జాతీయం
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ ప్రసూతి మరణాలు, ప్రసవాలు మరియు నవజాత శిశువుల మరణాలలో 60 శాతం మరియు ప్రపంచవ్యాప్తంగా 51 శాతం సజీవ జననాలకు కారణమయ్యే 10 దేశాల జాబితాలో భారతదేశం ముందుంది.
.పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్తంగా అతని మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం మరియు లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ నివాసంపై దాడి చేశారు. ఖాన్ మద్దతుదారులు గుజ్రాన్వాలా కంటోన్మెంట్ ప్రవేశాన్ని తగులబెట్టారు
అగ్ర దేశం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్ ను ట్రంప్ లైంగికంగా వేధించాడని న్యూయార్క్ జ్యూరీ తేల్చింది.
ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల సందర్బంగా మంగళవారం తెల్లవారుజామున గాజాలో ముగ్గురు ఇస్లామిక్ జిహాద్ కమాండర్లు మరియు నలుగురు మైనర్లతో సహా మరో తొమ్మిది మంది పౌరులు మృతి చెందారు. ఇజ్రాయెల్ సైన్యం 'ఆపరేషన్ షీల్డ్ అండ్ ఆరో ప్రారంభాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఐస్ క్రీమ్ అంటేనే నోరూరిపోతుంటుంది కదా. బయట భానుడు భగభగమంటున్నాడు. ఈ వేడిలో ఒక ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరేమో.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అరెస్టు చేసారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అక్బర్ నాసిర్ ఖాన్ పేర్కొన్నట్లు ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికా లోని టెక్సాస్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ నగరంలోని బ్రౌన్స్‌విల్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దక్షిణ పెరూలోని బంగారు గనిలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. లా ఎస్పెరాంజా 1 గనిలోని సొరంగంలో మంటలు చెలరేగడం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు సమాచారం అందించారు.
:ప్రస్తుతం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. టెక్సాస్‌లోని డల్లాస్ శివారులోని అలెన్లోనిమాల్లో ఒక సాయుధుడు కనీసం తొమ్మిది మందిని కాల్చిచంపాడు. మాల్‌ను కలిగి ఉన్న ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యుఎస్ ప్రతినిధి కీత్ సెల్ఫ్ మాట్లాడుతూ ఎదురుదాడిలో కాల్పులు జరిపిన వ్యక్తి చనిపోయాడని చెప్పారు.