Last Updated:

Cyclone Mocha: మయన్మార్‌లో 81 కి చేరిన మోచా తుఫాను మృతుల సంఖ్య

:మయన్మార్‌లో మోచా తుఫానుతో మరణించిన వారి సంఖ్య 81 కి చేరింది. ప్రజలు తుఫాను ధాటికి కుప్పకూలిన తమ ఇళ్ల శిధిలాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. పలువురు ప్రభుత్వం సహాయం కోసం వేచి ఉన్నారు.

Cyclone Mocha: మయన్మార్‌లో 81 కి చేరిన మోచా తుఫాను మృతుల సంఖ్య

 Cyclone Mocha:మయన్మార్‌లో మోచా తుఫానుతో మరణించిన వారి సంఖ్య 81 కి చేరింది. ప్రజలు తుఫాను ధాటికి కుప్పకూలిన తమ ఇళ్ల శిధిలాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. పలువురు ప్రభుత్వం సహాయం కోసం వేచి ఉన్నారు.మోచా తుఫాను ప్రభావంతో ఆదివారం నాడు 195 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పలు విద్యుత్ స్తంభాలు, ఫిషింగ్ బోట్లను ధ్వంసం చేసాయి.

కూలిన చెట్లు.. దెబ్బతిన్న కమ్యూనికేషన్లు..( Cyclone Mocha)

రోహింగ్యా ముస్లిం మైనారిటీలు నివసించే బు మా మరియు సమీపంలోని ఖౌంగ్ డోకే కర్ గ్రామాలలో కనీసం 46 మంది మరణించారు.సిట్వేకు ఉత్తరాన ఉన్న రాథేడాంగ్ టౌన్‌షిప్‌లోని ఒక గ్రామంలో మఠం కూలిపోవడంతో 13 మంది మరణించారు. దానికి పొరుగున ఉన్న గ్రామంలో భవనం కూలిపోవడంతో ఒక మహిళ మరణించింది. ఓన్ తా చాయ్ గ్రామంలో ఒకరు, ఓహ్న్ తావ్ గైలో ఆరుగురు మృతి చెందారని స్థానిక నాయకులు, అధికారులు తెలిపారు.రాష్ట్ర మీడియా సోమవారం ఐదు మరణాలను నివేదించింది.మోచా తుఫాను గ్రామాలను అల్లకల్లోలం చేసింది. దీని ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలగా రాఖైన్ రాష్ట్రంలో చాలా వరకు కమ్యూనికేషన్లు ధ్వసంమయ్యాయి. మరోవైపు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న మయన్యార్ కు అత్యవసర విపత్తు సహాయ సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.

బంగ్లాదేశ్‌లో దాదాపు పది లక్షల మంది రోహింగ్యాలు నివసించే విశాలమైన శరణార్థి శిబిరాలు తుఫానుకు ప్రభావితం అయినప్పటికీ ఎవరూ చనిపోలేదని అధికారులు తెలిపారు.తుఫాను ప్రభావం చాలా దారుణంగా ఉన్నప్పటికీ, శరణార్థి శిబిరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది మందికి సహాయం అవసరం ఉందని వారు చెప్పారు.