Home / అంతర్జాతీయం
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) కు చెందిన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జప్తు చేసుకున్నారని పాకిస్తాన్‌కు చెందిన ఎఆర్‌వై న్యూస్ మంగళవారం నాడు వెల్లడించింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగిన చర్చా వేదికలో రాహుల్ పాల్గొన్నారు. హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.
2019లో నార్వేలో తిరిగిన బెలూగా తిమింగలం స్వీడన్ తీరంలో మళ్లీ కనిపించింది.ఇది రష్యన్ నావికాదళం ద్వారా శిక్షణ పొందిన గూఢచారి అని ఊహాగానాలకు దారితీసింది, మానవ నిర్మిత జీను కారణంగా తిమింగలం రష్యా నావికాదళం ద్వారా శిక్షణ పొందిందని ఊహాగానాలు చెలరేగాయి.
అమెరికా సైనిక కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఉత్తర కొరియా తన మొదటి సైనిక నిఘా ఉపగ్రహాన్ని జూన్‌లో ప్రయోగించనుందని రాష్ట్ర మీడియా KCNA మంగళవారం నివేదించింది. కెసిఎన్ఎ వార్తా సంస్థ నిర్వహించిన ఒక ప్రకటనలో, పాలక వర్కర్స్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్-ఛైర్మన్ రి ప్యోంగ్ చోల్, యునైటెడ్ స్టేట్స్ మరియు దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను బహిరంగంగా దూకుడుగా ఉన్నాయని ఖండించారు.
18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది.
టర్కీలో తనకు తిరుగులేదని తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి నిరూపించుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాలుగా టర్కీ పాలకుడిగా కొనసాగుతున్న ఎర్డోగాన్.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది
కెనడాలో భాతర సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ను ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన వాంకోవర్ సిటీలో జరిగింది. గ్యాంగ్ వార్ వల్లే ఈ కాల్పుల ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఏకాంతంగా సమావేశం అయిన తర్వాత బెలారస్ అధ్యక్షుడు లుకషాన్కో ను హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఆస్ట్రియాలోని ఇంటిని పోలీసు అధికారులకు మానవ హక్కుల శిక్షణా కేంద్రంగా మార్చనున్నట్లు ఆస్ట్రియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.