Meta Layoffs: మెటాలో మరో 6,000 మంది ఉద్యోగుల తొలగింపు?
Meta Layoffs: మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
Meta Layoffs: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో సారి ఉద్యోగుల తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
భారీగా తొలగింపు.. (Meta Layoffs)
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరో సారి ఉద్యోగుల తొలగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల కోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు సమాచారం. అమెరికన్ మీడియా సంస్థ ‘వోక్స్’ నివేదిక ప్రకారం.. తొలగింపులపై మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది.
ఉద్యోగుల ఉద్వాసనపై వెలుగులోకి వచ్చిన నివేదికల ఆధారంగా మెటా వచ్చే వారంలో 6 వేల మందిపై వేటు వేయనుంది.
నవంబర్‌లో 11వేల మందిని.. మార్చిలో 4వేల మందిని ఈ కంపెనీ ఉద్యోగులను ఇంటికి పంపింది. తాజాగా మే నెలలో 6 వేల మందిని ఇంటికి సాగనంపనుంది.
ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో సిబ్బందిని ఇంటికి సాగనంపే ఆలోచనలో మెటా ఉన్నట్టు తెలుస్తోంది.
అవసరం లేని డిపార్ట్ మెంట్లలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం.
దీంతో మరోసారి కూడా వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టక తప్పదు.
ఇటీవలి కాలంలో మెటాకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. దీంతో ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం కష్టతరంగా మారింది.
దీంతో వ్యయ నియంత్రణ చర్యలు అనివార్యమయ్యాయి. అందులో భాగంగానే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది.
తీసివేతల్లో భాగంగా ఇప్పటికే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు జారీ చేసేందుకు మెటా సిద్దమైంది.?