Home / Indonesia
ఇండోనేషియాలోని సెంట్రల్ ద్వీపం సులవేసిలో ఒక అక్రమ బంగారు గని సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మరణించగా 19 మంది తప్పిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో చైనా యాజమాన్యంలోని నికెల్ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు కారణంగా 13 మంది కార్మికుల మరణించగా పులువురు గాయపడినట్లు పోలీసులు మరియు తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పిలవబడే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన బహుళజాతి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇండోనేషియాలోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్లలో జరిగిన ఘోరమైన ప్రమాదాలలో ఇది తాజాది.
పశ్చిమ సుమత్రాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలయింది. ఇండోనేషియా రెస్క్యూ సిబ్బంది 11 మంది పర్వతారోహకుల మృతదేహాలను కనుగొన్నారు. ఈప్రమాదం నుంచి ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడగా, 12 మంది కనిపించలేదు.
ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుంచి బోర్నియోకు తరలిస్తోంది. 2045 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో ఉన్న ఇండోనేషియా తన కొత్త రాజధాని పర్యావరణ హితంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాదు ఇది అటవీనగరంగా ఉంటుందని తెలిపింది.
ఇండోనేషియాలో శుక్రవారం నాడు చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు
ఇండోనేసియాలోని అతి ఎత్తయిన అగ్నిపర్వతం ‘మౌంట్ సెమేరు’ బద్దలైంది. దీనితో సెమేరు చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగ కమ్ముకుని చుట్టుపక్కల ప్రాంతాల వారిని కలవరానికి గురిచేసింది. అలాగే, దాదాపు 19 కిలోమీటర్ల మేర బూడిద వ్యాపించి ఆవాసాలను, అన్నింటిని పూర్తిగా కప్పేసింది.
ఇండోనేషియాను వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. నిన్న సంభవించిన భూ ప్రకంపనల ధాటికి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో సోమవారం సంభవించిన భూకంపంలో కనీసం 44 మంది మరణించారు . 300 మందికి పైగా గాయపడ్డారు.
ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. జీ20 సభ్య దేశాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే బాలికి చేరుకున్నారు. తొలి సెషన్‌కు హాజరయ్యారు.