Published On:

Delta Plane : కాసేపట్లో టేకాఫ్.. విమానంలో మంటలు

Delta Plane : కాసేపట్లో టేకాఫ్..  విమానంలో మంటలు

Delta plane : అమెరికాలోని ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. USAలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డేల్టా అనే విమానం కాసేపట్లో టేకాఫ్ అవుతుందనగా మంటలు చెలరేగాయి. రెండు ఇంజన్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 282మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరిని సిబ్బంది అత్యవసర ఎక్జిట్ ద్వారం నుంచి జారవిడిచారు. ప్రస్తుతం ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విమానానికి మంటలు అంటుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11. 06 నిమిషాలకు డెల్టా ఎయిర్ లైన్స్ 1213 విమానం కాసేపట్లో గాల్లోకి లేవడానికి రెడీగా ఉంది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు విమానంలో కూర్చున్నారు. అంతలోనే విమానం కుడివైపు ఉన్న ఇంజన్ లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. రెప్పపాటు కాలంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో, ఎయిర్ క్రాఫ్ట్ రెస్క్యూ సిబ్బంది మరియు ఫైర్ ఫైటింగ్ టీం అత్యవసరంగా స్పందించారు. ప్రయాణికులను అత్యంత చాకచక్యంగా విమానం నుంచి జారవిడిచారు.

 

ఎయిర్ బస్ A330 విమానం 282మంది ప్రయాణికులు, 10మంది విమాన సిబ్బంది, ఇద్దరు పైలట్లతో హార్ట్స్‌ఫీల్డ్-జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని ప్రయాణికులు మొబైల్స్ లో రికార్డ్ చేశారు. విమాన ప్రమాదానికి కారణాలు తెలియవని FFA తెలిపింది. దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

 

ప్రయాణికులే తమ మొదటి ప్రాముఖ్యతని డెల్టా ఎవియేషన్ ప్రకటించింది. ప్యాసెంజర్స్ కు కలిగిన అసౌకర్యనికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి మరో విమానాన్ని సమకూరుస్తున్నట్లు అధికారులు చెప్పారు.