US – China Trade War: చైనా- అమెరికా ట్రేడ్ వార్ కు బ్రేక్.. ఇరుదేశాల కీలక మధ్య ఒప్పందం

America- China Trade Agreement: కొద్దిరోజులుగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కి తెరపడింది. అయితే ప్రపంచదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పుత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను విధించారు. భారత్ సహా పలు దేశాలకు వీటిని ప్రతిపాదించారు. అయితే పలు దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో.. సుంకాల విధింపు ప్రతిపాదనను 90 రోజుల వరకు వాయిదా వేశారు.
కానీ అమెరికా విధించిన సుంకాలకు ప్రతికార చర్యగా చైనా కూడా అమెరికాపై దిగుమతి సుంకాలను విధించింది. దీంతో చైనాపై 145 శాతం దిగుమతి సుంకాలను పెంచుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికా- చైనా మధ్య కొద్దిరోజులుగా ట్రైడ్ వార్ నడుస్తోంది. దీనిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలోనే ఇరుదేశాలు పరసర్పం వాణిజ్య ఉత్పత్తులపై విధించిన సుంకాలను తాత్కాలికంగా తగ్గించేందుకు సంయుక్తంగా ఓ నిర్ణయం తీసుకున్నాయి.
రాబోయే 90రోజులపాటు ఇరుదేశాలు తమ సుంకాలను గణనీయంగా తగ్గించనున్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించనుంది. మరోవైపు చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతంగా ఉన్న సుంకాన్ని 10 శాతానికి తగ్గించింది.
ఈ మేరకు జెనీవాలో రెండు రోజులపాటు జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. చర్చల్లో ఇరుదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. 90 రోజుల విరామ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, సుంకాలను గణనీయంగా తగ్గించామని చెప్పారు.