Last Updated:

Afghanistan floods: ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు 20 మంది మృతి

ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్‌ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్‌లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్‌

Afghanistan floods: ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు 20 మంది మృతి

Afghanistan: ఆప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలకు కనీసం 20 మంది మృతి చెందారు. సుమారు 3వేల కంటే ఎక్కువ ఇళ్లు ధ్వంసమయ్యాయి. శనివారం తూర్పు ఆప్ఘనిస్తాన్ లోని లోగార్‌ ప్రావిన్స్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ప్రావిన్స్‌లో 30 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని ప్రావెన్స్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. భారీ వర్షాలకు 5వేల ఎకరాల్లో పళ్ల తోటలు దెబ్బతిన్నాయి. సుమారు 2వేల వరకు పశువులు మృతి చెందాయని అధికారులు తెలియజేశారు.

ప్రతి ఏడాది భారీ వర్షాలకు ఆప్ఘనిస్తాన్ లో పలువురు మృతి చెందుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కచ్చా ఇల్లు కూలిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. భద్రతా దళాలు, చారిటీ సంస్థలు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ సమాజం బాధితులను ఆదుకోవాలని ఆప్గాన్‌ ప్రభుత్వం కోరుతోంది. స్థానిక వాతావరణ శాఖ మాత్రం రాబోయే రోజుల్లో దేశంలోని 21 ప్రావెన్స్‌ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి: