Covid Booster Dose: బూస్టర్ డోస్ అందరూ వేయించుకోవాలిసిందే..
కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పక్క కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్క వ్యాక్సిన్లు వేస్తూనే ఉన్నారు. మన కంటికి కనిపించని చిన్న వైరస్ మనలని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది.
New Delhi: కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పక్క కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్క వ్యాక్సిన్లు వేస్తూనే ఉన్నారు. మన కంటికి కనిపించని చిన్న వైరస్ మనలని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తుంది. బయటికి వెళ్లాలనుకున్న ప్రశాంతంగా వెళ్లలేకపోతున్నాం అలాగే ఒక నిలుచొనే చోటులో కూడా నిలబడలేకపోతున్నాం ఇలాంటి పరిస్థితిలు వస్తాయని మనం కలలో కూడా అనుకోలేదు.
అందరికీ వ్యాక్సిన్లు రెండు డోస్లు అయి పోయే ఉంటాయి. ఇప్పుడు తాజాగా బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలని టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఛైర్మన్ ఎన్ కె అరోరా సూచించారు. మీరు ముందు తీసుకున్న వ్యాక్సిన్ లో ఉండే యాంటీ బాడీలు 8 నెలల్లో దాని ప్రభావం తగ్గిపోతుంది. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోందన్న విషయాన్ని మరవకూడదని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందాలని సూచించారు.