Last Updated:

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ పెద్ద వెధవ – బెట్టింగ్‌ యాప్స్‌తో కోట్లు సంపాదించాడు, రైతుబిడ్డ బండారం బయటపెట్టిన అన్వేష్‌

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ పెద్ద వెధవ – బెట్టింగ్‌ యాప్స్‌తో కోట్లు సంపాదించాడు, రైతుబిడ్డ బండారం బయటపెట్టిన అన్వేష్‌

Youtuber Anvesh Slams Raithu Bidda Pallavi Prashanth: బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నారు హైదరాబాద్‌ మాజీ అడిషనల్‌ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. ఈ క్రమంలో ఈ బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోటు చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నారు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్షల్లో డబ్బులు తీసుకుని బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్స్‌ చేసిన సెలబ్రిటీలపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే యూటూబర్‌ హర్షసాయి, లోకల్‌ బాయ్‌ నాని, సన్నీ యాదవ్‌లపై కేసులు నమోదయ్యాయి. దీంతో సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్స్‌ సుప్రిత, రితూ చౌదరిలు తమ తప్పు తెలుసుకుని దిగివచ్చారు.

బెట్టింగ్ యాప్స్ వ్యతిరేకంగా సజ్జనార్ ఉద్యమం

తెలుసో తెలియక బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్‌ చేశామని, వాటిని ఎవరూ నమ్మొద్దంటూ వీడియోలు రిలీజ్‌ చేస్తున్నారు. మరోవైపు యువత బెట్టింగ్‌ యాప్స్‌కు బానిసలైన యువతలో అవగాహన కల్పించేందుకు సోషల్‌ మీడియాలో తరచూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ దూరంగా ఉండాలని వారికి సూచిస్తున్నారు. ఎలాగైనా బెట్టింగ్‌ భూతం నుంచి యువతను, పేద కుటుంబాలను కాపాడాలని పూనుకుని వాటి నిర్మూలనను సజ్జనార్‌ ఓ ఉద్యమంలా చేపట్టారు. ఇందులో యూట్యూబర్‌, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌ కూడా భాగం అయ్యారు.

బెట్టింగ్‌ యాప్స్‌ హానికరమని హెచ్చరిస్తూ వాటిని ప్రమోట్‌ చేసినవారిపై విమర్శలు గుప్పిస్తున్నాడు. కోట్లు కోట్లు డబ్బులు తీసుకుని ఈ పాడు పనికి పూనుకున్నారని, అలాంటి వారిపై కంప్లైయింట్స్‌ చేసిన వారి నుంచి డబ్బులు వసూళ్లు చేయాలని పిలుపునిస్తున్నాడు. ఇలా వరసగా వీడియోలు షేర్‌ చేస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా తెలుగు బిగ్‌బాస్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌పై విరుచుకుపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానళ్లలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ను ఏకిపారేశాడు.

పల్లవి ప్రశాంత్‌ అంటే అసహ్యం

సానుభూతితో బిగ్‌బాస్‌ ఆఫర్‌ కొట్టేసాడు. గెలిచాక ప్రైజ్‌మనీ రైతులకు ఇస్తానన్నాడు. ఇచ్చాడా? గెలిచాక రైతుల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేస్తానన్నాడు. అవేవి చేయకుండ క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్స్‌ పాల్పడ్డాడు. ఇలాంటి వాడు కనిపిస్తే పేడ తీసి కొట్టాలి. నన్ను కూడా సపోర్టు చేయాలని అడిగాడు. రైతుబిడ్డను.. రైతుల కోసం పోరాటం చేస్తానంటూ సపోర్టు చేయమని ముష్టివాడిలా అడుకున్నాడు. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. గెలిచాక..రైతుల కోసం పోరాటం చేస్తానన్నా వెధవ.. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్‌కి పాల్పడ్డాడు.

రైతులంటే ఎంతో గౌరవం ఉంటుంది. కానీ వీడి పేరు అంటేనేనాకు అసహ్యం. ప్రపంచంలో నేను ఎవరిని అసహ్యించుకోను. కానీ ఈ పల్లవి ప్రశాంత్‌ గాడు ఒక్కడంటనే నాకు అసహ్యం. వాడు వెధవ అని నేను ముందే చెప్పాను. ఎవరూ నన్ను నమ్మలేదు,పైగా నన్నే తిట్టారు. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు ముష్టివాడిలా అడుక్కున్న ఈ పల్లవి ప్రశాంత్‌.. బయటకు వచ్చాక సూటు, బూటు.. ఆరుగురు సెక్యురిటీగార్డులు, కార్లు! వీడికి అంత అవసరమా? బెట్టింగ్‌ యాప్స్‌తో ఒక్కొక్కరూ కోట్ల కోట్లకు సంపాదించుకుంటున్నారు.

వారంత కోట్లు కోట్లు సంపాదించారు..

ఇప్పటికైనా అందరు అవగాహన తెచ్చుకోండి. ఈ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌ చేయడం చట్టరిత్యా నేరం. కాబట్టి ఈ ఇన్‌ఫ్లూయెన్సర్ల వల్ల నష్టపోయినవాళ్లందరూ పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయండి. వారి దగ్గరి నుంచే నష్టపరిహారం తీసుకోండి. ఆఏవాడు చచ్చిపోతుంటే.. ఆడించేవారు మాత్రం కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఈ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసినందుకుగానూ హర్షసాయిపై, లోకల్‌ బాయ్‌ నాని, సన్నీయాదవ్‌లపై ఇప్పటికే కేసు నమోదైనట్టు తెలుస్తోంది. నెక్ట్స్‌ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు కానుందని టాక్‌ వినిపిస్తోంది.