Last Updated:

Devara Movie : కళ్ళు చెదిరే ధరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర” డిజిటల్ రైట్స్.. ఎంతకంటే ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి. 

Devara Movie : కళ్ళు చెదిరే ధరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ “దేవర” డిజిటల్ రైట్స్.. ఎంతకంటే ?

Devara Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

హై వోల్టేజ్ట్ యాక్షన్ మూవీగా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు మరో 5 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ పూర్తి అయినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ రైట్స్ ని కళ్ళు చెదిరే ధరకి కొనుగోలు చేసిందని చెప్పుకుంటున్నారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు ఈ మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకుందని అంటున్నారు. ఇందుకోసం ఏకంగా రూ. 150 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Image

భారీ బడ్జెట్ తో  బడ్జెట్ తో  ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘వార్ 2’లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు.