Last Updated:

Vishwak Sen: ఇకపై నా సినిమాల్లో అసభ్యత ఉండదు – లైలా రిజల్ట్‌పై స్పందించిన విశ్వక్‌ సేన్‌

Vishwak Sen: ఇకపై నా సినిమాల్లో అసభ్యత ఉండదు – లైలా రిజల్ట్‌పై స్పందించిన విశ్వక్‌ సేన్‌

Vishwak Sen Apologises to Fans: లైలా మూవీ ఫలితంపై మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ స్పందించాడు. ఈ మేరకు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన ఇచ్చాడు. ఫిబ్రవరి 14న ఎన్నో అంచనాల మధ్య లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయం పొందింది. ఫస్ట్‌ షో నుంచి ప్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. విశ్వక్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా లైలా మూవీ నిలిచింది. ఈ మధ్య విశ్వక్‌ నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోతున్నాయి. గతేడాది విశ్వక్‌ నటించిన మూడు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. ‘గామీ’ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి ప్లాప్‌గా నిలిచింది.

ఇక మోకానిక్‌ రాకీ పర్వాలేదనిపించింది. ఈ ఏడాది రిలీజైన లైలా బాక్సాఫీసు వద్ద ఢిలా పడింది. తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదని, తనని క్షమించాలని కోరాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన ఇచ్చాడు. “ఇటీవల నా సినిమాలు అందరు కోరుకున్న స్థాయికి చేరుకోవడం లేదు. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మ నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన నా అభిమానులకు, నాకు ఆశీర్వాదంగా నిలిచి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నా. నా ప్రాధాన్యత ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే.

కానీ, ఆ ప్రయత్నంలో ఈ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నా. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్‌, మాస్‌ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెత్త సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్‌ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు. నా ప్రతి సన్నివేశం మీకు మనసుకు తాకేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

అలాగే నా కథానాయకులు దర్శకుడు, రచయితలు నా వెన్నుముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరోక బలమైన కథతో మీ ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం” అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌ జాతిరత్నాలు ఫేం అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి రూపొందిస్తున్నా ఈ సినిమాను ప్రేమ, వినోదం నేపథ్యంలో ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)