Tamannaah Bhatia: అద్భుతాలు జరగాలని ఎదురుచూడకండి.. తమన్నా పోస్ట్ వైరల్

Tamannaah Bhatia: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు ముగుస్తాయో ఎవరికి తెలియదు. రెండు మూడేళ్లు ప్రేమ పక్షుల్లా తిరిగినవారు.. పెళ్లి వరకు రాకముందే విడిపోతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో తమన్నా కూడా చేరిన విషయం తెల్సిందే. తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్ కు వెళ్ళినప్పుడు అమ్మడి రేంజ్ పెరిగిందని అందరూ అనుకున్నారు.
ఇక లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీస్ లతో తమ్ము ఇంటిమేటెడ్ సీన్స్ లో కనిపించి పూర్తిగా బాలీవుడ్ భామగా మారిపోయింది. రేయ్ అసలు మా తమన్నా ఎలా ఉండేది.. ? ఎలా మార్చేశారురా అని తెలుగు అభిమానులు నెత్తినోరు కొట్టుకున్నారు. ఇక అది కూడా చాలదన్నట్లు తమన్నా.. విజయ్ వర్మ ప్రేమలో పడింది. నటుడిగా అప్పుడప్పుడే ఎదుగుతున్న విజయ్ వర్మ.. తెలుగులో MCA సినిమాలో విలన్ గా కనిపించాడు. ఆ తరువాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఇక ఇతగాడితో మిల్కీ బ్యూటీ చెట్టపట్టాలు వేసుకొని తిరగడమే కాకుండా గతేడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విజయ్ కు లిప్ లాక్ ఇస్తూ కెమరా కంటికి చిక్కింది. ఇంకేముందీ వీరిద్దరి మధ్య ప్రేమాయణం బట్టబయలు అయ్యింది. దీంతో ఎలాగో అందరికీ తెల్సిందే కదా అనుకోని వారు కూడా తాము రిలేషన్ లో ఉన్నట్లు ప్రకటించారు.
సర్లే.. ప్రేమలో ఉన్నారుగా త్వరలోనే పెళ్లి చేసుకుంటారు. తమ్ము బ్యూటీ కూడా వివాహితగా మారిపోతుంది అని అనుకున్నారు. ఎప్పుడు ఈ జంట కెమెరా కంటికి కనిపించినా పెళ్ళెప్పుడు అని అడగడం యధావిధిగా మారిపోయింది. అన్ని అనుకుంటే అది జీవితం ఎందుకు అవుతుంది అన్నట్లు.. తమన్నా సడెన్ గా విజయ్ తో ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించడం సెన్సేషన్ గా మారింది. ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు అని వార్తలు గుప్పుమన్నాయి.
ఇవేమి నిజం కాదన్నట్లు.. ఈమధ్య హొలీ పండగ వేడుకలో తమన్నా- విజయ్ వర్మ కలిసి కనిపించారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా తమన్నా బ్రేకప్ బాధలో ఉన్న అమ్మాయి పెట్టే పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది. ” జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకోకండి. వాటికోసం ఎదురుచూడకండి. దానికి బదులు మీకు మీరే అద్భుతాలు సృష్టించడం నేర్చుకోండి” రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ విజయ్ గురించేనా అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.