Check if Your Phone Hacked: మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా..? ఈ సింపుల్ టిప్స్ తో తెలుసుకోండి?

How to Check my Phone Hacked or Not..?: తాము వాడే ఫోన్ హ్యాక్ అయిందా లేదా అని ఆందోళన చెందే వారు చాలా మందే ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యక్తిగత డేటా లీక్ కావడం, క్రిమినల్ కేసులు పెరగడం వల్ల మన ఫోన్ సురక్షితంగా ఉందా లేదా ఎవరైనా దాన్ని ట్రాక్ చేస్తున్నారా అని ఆలోచించాల్సి వస్తోంది. ఈ రోజుల్లో హ్యాకర్లు మన ఫోన్ నుండి ప్రైవేట్ ఫోటోలు, బ్యాంక్ ఖాతా యొక్క అన్ని వివరాలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని సమయాల్లో మనం లాటరీ, షాపింగ్‌పై తగ్గింపు కోసం లేదా లోన్స్ కోసం బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ ఇస్తుంటాం. ఇలాంటి సమయంలో హ్యాకర్లు మీ డేటాను ఈ-మెయిల్స్ ద్వారా లీక్ చేసే ప్రమాదం ఉంటుంది.
ఫోన్లు ఎలా హ్యాక్ చేయబడతాయి..?
పరిశోధన ప్రకారం.. హ్యాకర్లు ఫోన్ పిన్ కోర్డ్ ట్రాక్ చేయడం ద్వారా దాన్ని హ్యాక్ చేయవచ్చు. 4 అంకెల పిన్‌ను క్రాక్ చేయడం చాలా సులభమైన పని. చాలా మంది దీన్ని ఒకే ప్రయత్నంలోనే చేస్తారు. 5 ప్రయత్నాల తర్వాత 100% సరైన అంచనా వేస్తారు. ఇదంతా మీ ఫోన్ నుండి సేకరించిన డేటా ద్వారా జరుగుతుంది.
జీఎల్ వాట్సాప్ ఛానల్:
చాలా యాప్‌లు , వెబ్‌సైట్‌లు మీ GPS, కెమెరా, ఇతర యాప్‌ల యొక్క అనుమతి అడుగుతాయి. ఈ సాకుతో అవి మీ డేటాను హ్యాక్ చేయడం చాలా సులభం అవుతుంది. వీటన్నింటికీ అనుమతి అడగకపోయినా.. సెన్సార్ వినడం ద్వారా ఈ విషయాలన్నింటికీ యాక్సెస్ పొందుతుంది. ఫలితంగా మీ మొత్తం సమాచారాన్ని దొంగిలిస్తుంది.
మీరు హ్యాకింగ్‌కు గురయ్యే వెబ్‌సైట్‌ను తెరిచి.. దాన్ని మూసివేయకుండా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా ఖాతా పిన్‌ను ఎంటర్ చేస్తే.. హ్యాకర్లు మీ డీటైల్స్ తెలుసుకోవడం మరింత సులభం అవుతుంది. వారు మీ ఫోన్ లాక్ చేయబడిన తర్వాత కూడా దానిపై నిఘా పెట్టవచ్చు . హ్యాకర్ మీ ఫోన్ పాస్‌వర్డ్‌ను కూడా మార్చవచ్చు, తద్వారా అతను మీ మొత్తం డేటా వారికి తెలిసిపోతుంది.
మీ ఫోన్‌ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడం ఎలా ..?
మీ ఫోన్‌ను మీకు తెలియకుండా వేరే ఎవరైనా ఉపయోగిస్తుంటే.. మీరు ఈ విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం.. మీరు మీ ఫోన్‌లో ##002#, *#21#, *#62# వంటి కొన్ని కోడ్‌లను డయల్ చేసి చూడాలి. #02# : మీ వాయిస్ కాల్స్ లేదా సందేశాలు ఫార్వార్డ్ చేయబడుతుంటే.. ఈ కోడ్ వాటిని తొలగిస్తుంది. #21#: మీ కాల్స్ ఇతరులకు మళ్లించబడుతుంటే, ఈ కోడ్ ద్వారా గుర్తించవచ్చు. #62# : మీకు తెలియకుండానే మీ కాల్‌లు లేదా మెసేజ్‌లు ఫార్వార్డ్ చేయబడితే, ఈ కోడ్‌ను డయల్ చేయడం ద్వారా దాన్ని గుర్తించవచ్చు.
మీరు ఈ నంబర్లకు డయల్ చేస్తే.. ఎవరైనా మీ ఫోన్‌ను ట్రాక్ చేస్తున్నారా లేదా అని మీరు సులభంగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఇలాంటివి జరగకుండా కూడా ఆపవచ్చు. కాబట్టి నేటి నుంచి ఏ యాప్ లేదా వెబ్‌సైట్ ను లేకుండా మీ ఫోన్ లేదా డేటాను యాక్సెస్ చేయడానికి అవకాశం ఇవ్వకండి. లేకుంటే మీ డేటా అంతా లీక్ కావచ్చు.