Last Updated:

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ కు రెడీ అవుతున్న పూరీ.. పూజాకార్యక్రమాలతో సినిమా స్టార్ట్

Double Ismart: భారీ అంచనాల నుడుమ రిలీజైన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దానితో కోలుకోలేని దెబ్బ తిన్న పూరీ ఆ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేయనున్నాడు.

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ కు రెడీ అవుతున్న పూరీ.. పూజాకార్యక్రమాలతో సినిమా స్టార్ట్

Double Ismart: భారీ అంచనాల నుడుమ రిలీజైన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దానితో కోలుకోలేని దెబ్బ తిన్న పూరీ ఆ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేయనున్నాడు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు.. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడంటూ ప్రేక్షకులు ఊరికే అనరు మరి. అందుకే ఈసారి ఇస్మార్ట్ గా డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు పూరీ. అది కూడా తనదైన ఫార్మాట్‌లోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడిన పూరీ ఇప్పుడు ఈ సినిమాను మాత్రం సంవత్సరంలోపే కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇటీవలె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు పూరీ. అది కూడా రిలీజ్‌ డేట్‌తో సహా ప్రకటించేశాడు.

పూజాకార్యక్రమాలతో సినిమా స్టార్ట్(Double Ismart)

వచ్చే మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు.. అనౌన్స్మెంట్ చేసిన రోజే చెప్పేశాడు. దీనితో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ని చూడడానికి రామ్ ఫాన్స్ కూడా రెడీ అయ్యారు. కాగా మొన్నటిదాకా అనౌన్స్ మెంటే కానీ దానికి సంబంధించిన ఎటువంటి అప్ డేట్ లేదు కానీ తాజాగా ఈ కాంబినేషన్ ఎట్టకేలకు తమ సినిమాను లాంచ్ చేసింది. పూజా కార్యక్రమాల్ని పూర్తి చేసి జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నట్టు చెప్పేసారు పూరీ. జులైలో లాంఛనంగా మొదలుపెట్టి, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఎట్టి పరిస్థితుల్లోను మార్చ్ 8న చెప్పిన డేట్ డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ చేసేయాలని పూరి ప్లాన్ చేసాడని సమాచారం. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీనుతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.