Chinni Krishna: టాలీవుడ్ కు “నరసింహనాయుడి”ని అందించి చిన్నికృష్ణ.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?
లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు.
Chinni Krishna: లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు. చిన్ని కృష్ణ కథ అందించిన చిత్రాల్లో బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, చిరంజీవి ‘ఇంద్ర’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
1999లో తెలుగు చిత్రపరిశ్రమలో తన జర్నీని స్టార్ట్ చేసి అనతికాలంలో ప్రముఖ రచయితగా పేరుపొందాడు. కొద్దిరోజుల్లోనే ఆయన బాలకృష్ణ తమ్ముడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు అర్జున్ తొలిపరిచయంగా తెరకెక్కిన చిత్రమైన “గంగోత్రి”కి కూడా చిన్నికృష్ణ కథ అందించారు. కొన్నాళ్ళ విరామం అనంతరం మరల స్టైలిష్ స్టార్ తో “బద్రీనాథ్” అనే కథను కూడా అందించాడు. కాగా ఆ సినిమాతో అల్లు అర్జున్ కి ఓ మరపురాని డిజాస్టర్ ను ఇచ్చాడు చిన్నికృష్ణ. అయితే ఆ తర్వాత కొంతకాలానికి 2012లో “జీనియస్” అనే మరో అద్భుతమైన కథతో వెండితెరపైకి వచ్చారు. ఈ సినిమా విడుదలప్పుడు ఈయన అనేక సంచలన కామెంట్స్ చేసి ఆ మధ్యకాలంలో తెగ ట్రోల్ అయ్యారు కూడా. ఇంక ఆ తర్వాత మరో కథ రాయలేదు.
నిర్మాతగానూ..
ఇకపోతే ఈ‘నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించిన ప్రముఖ కథారచయిత చిన్నికృష్ణ ఇప్పుడు నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు.
చిన్నికృష్ణ స్టూడియోస్ బ్యానర్‌ని స్థాపించి తొలి ప్రయత్నంగా ‘‘కింగ్ ఫిషర్’’ అనే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రం ద్వారా తనయులు చిరంజీవి సాయి, బద్రీనాథ్‌లను నిర్మాతలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
రాజకీయ రంగప్రవేశం..
ఇకపోతే చిన్నికృష్ణ 2019లో వైసీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వైసీపీ ప్రచార సభలో పార్టీ కండువా కప్పుకున్నారు. చిన్నికృష్ణను జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలంతా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో జగన్, కేసీఆర్‌లపై పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలకు చిన్ని కృష్ణ కౌంటర్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీతో ఇండస్ట్రీకి ఒరిగిందేమీ లేదంటూ ఆయన అనేక సంచలన కామెంట్లు చేశారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వాళ్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పవన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో తమ మీద దాడులు జరిగితే.. పవన్ వచ్చి కాపాడతారా అంటూ అప్పట్లో ఆయన ప్రశ్నించారు.
పలు వివాదాల్లో..
హైదరాబాద్ శివార్లలలోని శంకర్ పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని కొందరు అక్రమించుకున్నారని.. చిన్ని కృష్ణ కొంతకాలం క్రితం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినందుకు తనపై కొందరు దాడికి యత్నించారని ఆయన ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా అనేక సార్లు ఆయన అనేక విధాలుగా వార్తల్లో నిలిచారు.
ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బాస్టర్ హిట్స్ అందిచిన చిన్నకృష్ణ మరల స్టోరీలు రాసి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని సినీ అభిమానులు కోరుతున్నారు.