Home / టెలివిజన్
ఆదివారం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 లో వాసంతి ఎలిమినేట్ అయ్యింది.ఇక ఈ వారం ఎనిమిది మంది హౌస్మెట్స్ నామినేషన్స్‌లో ఉండగా, ఆదివారం కావడంతో ఫన్నీగా గేమ్స్ ఆడుతూ ఒక్కొక్కరు సేవ్ అవుతూ కనిపించారు.
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్ శుక్రవారం (2022 నవంబర్ 11)న 702 ఎపిసోడ్‌తో ముగిసింది. ఎపిసోడ్ నవంబర్ 11 episode హైలైట్స్ చూద్దాం.
'బిగ్ బాస్ తెలుగు' సీజన్ ఆరులో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్‌గా గీతూ రాయల్ నిలిచింది. గీతూ రాయల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు యూట్యూబర్. ఆమె దూకుడు విధానం మరియు భాగస్వామ్యంతో, ఆమె చాలా వారాల పాటు ట్రెండింగ్‌లో ఉంది. అయితే, గీతూ రాయల్ ఈ వారం ప్రేక్షకులనుండి తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయింది.
వసుధారా నువ్వు నా జీవితాన్ని కూడా ఇలానే ప్రమిదలు వెలిగించినట్లు వెలిగించి ఒక వెలుగు చూపించావు. వసుని ఇలా మాటలతో తెగ పొగిడేస్తూ ఉంటాడు రిషి. వసు కళ్లు మూసుకుని గిర్రున తిరుగుతుంటే కాలు స్లిప్ అయ్యి రిషి మీద పడిపోతుంది.
సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోలోకి తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటని యాంకర్ సుధీర్ ను అడుగగా జబర్దస్త్ షో అన్నాడు. మరి ఎందుకు వదిలేశారు అని మళ్లీ అడిగారు సదరు యాంకర్. దానికి సుధీర్ జబర్దస్త్ షోను నేను విడిచి పెట్టలేదు. కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఒక 6 నెలలు బ్రేక్ తీసకున్నానని తెలిపారు.
మరోవైపు.. మహారాణి తులసి గారు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని.. అద్దె ఇల్లు చూడటానికి వెళ్తూ ఉంటుంది.మొదట ఓ ఇంటి ఓనర్....ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది.తులసికి బాగా నచ్చుతుంది.అడ్వాన్స్ మొదటి జీతం రాగానే ఇచ్చినా ఫర్వాలేదా? అని తులసి అంటుంది.
బాధ్యతకి ఆశకి తేడా తెలియని వాడు కాదమ్మా మీ తాతయ్యా...చూడు మా మనవరాలు మాతో వచ్చే వరకూ మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు...ఖర్చులకు ఉంచు’ అంటూకొంత డబ్బును కట్ట ఇంద్రుడు చేతిలో పెడతాడు ఆనందరావు.
కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే, ఈ టాస్క్ లో పాల్గొన్న పోటీదారులు శ్రీసత్య, ఫైమా, గీతూ, ఇనయ, వాసంతి, మెరీనా వీరందరూ తన బెలూన్లను కాపాడుకుంటూ ఇతరుల దగ్గర ఉన్న బెలూన్లను పగలగొట్టాలి. ఇలా చివరికి ఏ పోటీదారు దగ్గర బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే ఈ టాస్క్‌లో గెలిచి ఇంటి కెప్టెన్ అవుతారు.
బుల్లితెర నాట కార్తీకదీపం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెలివిజన్ రంగంలో ప్రస్తుతం ఈ ధారావాహిక రారాజుగా కొనసాగుతుంది. గత 5 ఏళ్ల నుంచి టాప్ రేటెడ్ సీరియల్ గా కొనసాగుతుంది. టీఆర్పీలో ఈ సీరియల్ అసమాన రికార్డ్స్ నమోదు చేసింది. తాజాగా 1500వ ఎపిసోడ్ పూర్తి చేసుకుని అన్ స్టాపబుల్ గా కొనసాగుతుంది.
అలా చేయడం తప్పుకదమ్మా’అని ఆదిత్య అంటాడు. ‘మరి ఏం చెయ్యాలి చెప్పు సారు, మా అమ్మని మంచిగా అడిగితే మా నాయన గురించి చెప్పడం లేదు ఇంక అందుకే అలా చేశాను’ అని నవ్వుతూ అలా చెప్తుంది. తరువాతి రోజే ఉదయాన్నే దేవికి ఓ సోదమ్మా ఎదురుపడుతుంది.