Last Updated:

Devatha Serial: మాధవ హత్యతో దేవత సీరియల్‌కు శుభం కార్డు

టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్ శుక్రవారం (2022 నవంబర్ 11)న 702 ఎపిసోడ్‌తో ముగిసింది. ఎపిసోడ్ నవంబర్ 11 episode హైలైట్స్ చూద్దాం. 

Devatha Serial: మాధవ హత్యతో దేవత సీరియల్‌కు శుభం కార్డు

Devatha: టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘దేవత’ సీరియల్ శుక్రవారం (2022 నవంబర్ 11)న 702 ఎపిసోడ్‌తో ముగిసింది. ఎపిసోడ్ నవంబర్ 11 episode హైలైట్స్ చూద్దాం.

భాగ్యమ్మ  సత్యకు నిజం చెప్పగా,  ఆదిత్య  దేవుడమ్మ కుటుంబానికి నిజం చెబుతాడు. ఆదిత్య నిజం చెప్పేటప్పుడే, దేవి రావడంతో అమ్మా ‘ఈ దేవినే నీ మనవరాలు’ అంటూ దేవుడమ్మకు  చెబుతాడు. సత్య తన అక్క తనకోసం చేసిన త్యాగాల గురించి తెలుసుకుని ఏడుస్తుంది. దేవుడమ్మ వాళ్లు,  రుక్మిణీ బతికి ఉండటం, మనవరాలు కూడా ఇంటికి రావడంతో సంతోషంలో మునిగిపోతారు.

మరో వైపు రాధ గుడిలో ఏడుస్తూ దేవత ముందు నిలబడి కళ్లు మూసుకుని దన్నం పెట్టుకుంటూ ఉంటే, అక్కడికి  మాధవ ఆవేశంగా వస్తాడు. రాధ కోసం వెతుక్కుంటూ కర్ర సాయంతో నడుస్తూ పరుగులు తీస్తూ ఉంటాడు.  రాధ ఓ దేవుడి విగ్రహం ముందు ఒంటరిగా కనిపిస్తుంది. వెంటనే జేబులోంచి తాళి బొట్టు తీసి, దగ్గరకు వెళ్లి తాళి కట్టడానికి సిద్ధపడతాడు. రాధ కళ్లు తెరిచేసరికి మాధవ తాళి పట్టుకుని కట్టేందుకు ప్రయత్నిస్తాడు. రాధ తోసే ప్రయత్నం చేస్తుంది. గట్టిగా తోసేసి ‘ఏంది సార్ ఏం చేస్తున్నావ్’ అంటూ అరుస్తుంది కోపంగా. ఈ తాళి కట్టి నిన్ను నా దాన్ని చేసుకుంటాను’ అంటాడు మాధవ  ‘వద్దు సారు.. నా దారి నన్ను పోనివ్వండి. నా బతుకు నన్ను బతకనివ్వండ్రి’  అంటూ రాధ పరుగులు తీస్తుంది. ఇది నా భర్త కట్టిన తాళి, దీన్ని చూసి అయినా విడిచిపెట్టండ్రి’ అంటుంది రాధ. ‘అది నీ మెడలో ఉంటేనే కదా వాడు నీ భర్త ’ అంటూ రాధ మెడలోని తాళిని తెంచేందుకు ట్రై చేస్తాడు మాధవ, అప్పుడే సత్య మాధవ తలపైన దేవుడి దీపాలు వెలిగించే స్టాండ్‌తో కొట్టేస్తుంది.  దెబ్బ తరగలడంతో, మాధవ రాధ మెడలోని తాళిని వదిలి, వెంటనే నేలపై కూలబడిపోతాడు. తల నుంచి చాలా రక్తం పోతుంది.

సత్యా ఏడుస్తూ. ‘అక్కా నన్ను క్షమించు, నా కోసం నువ్వు చేసినా త్యాగాలను కూడా అపార్థం చేసుకుని నిన్ను చాలా మాటలు అన్నాను. ఏ అక్కా చేయని త్యాగం నువ్వు నా కోసం చేస్తే, నువ్వు ఆదిత్య తప్పు చేశారని, నన్ను క్షమించు అక్కా’ అంటూ ఏడుస్తూ రాధ కాళ్లమీద పడిపోతుంది సత్య. ఇంతలో భాగ్యమ్మ, దేవి, చిన్మయిలని తీసుకుని గుడికి  వస్తూ ఉంటారు. అది చూసిన రాధ, వెంటనే సత్య పడేసిన దీపాల స్టాండ్‌ని తన చేతిలోకి తీసుకుంటుంది. దేవుడమ్మ, సూరి, రాజ్మమ్మ, దేవుడమ్మ భర్త, ఆదిత్య ఇలా అంతా ఆ సీన్ చూసి షాక్ అయ్యి, ఏం అయ్యిందంటే అంటూ సత్య చెప్తుంటే, రాధ అడ్డపడుతుంది.

రాధ ఆగమైన నా బతుకుని ఇంకా ఆగం చెయ్యాలని చూశాడు. అందుకే చంపేసా అంటుంది రాధ ఏడుస్తూ. సత్య షాక్ అవుతుంది. ఆదిత్య ఏడుస్తూ ‘నువ్వు చంపడం ఏంటీ రుక్మిణీ’ అంటాడు. రాధ దేవి చేతిని, చిన్మయి చేతిని సత్య చేతిలోపెట్టి  నీకే అప్పగిస్తున్నా, నువ్వే చూసుకోవాలి అంటుంది. దేవుడమ్మ దగ్గరకు నడిచి వెళ్లి, దన్నం పెట్టి ‘నన్ను క్షమించు అత్తమ్మా. నీ నుంచి తప్పించుకోవడానికి నీకోడల్ని కాదు అన్నాను కానీ, నేను చచ్చేదాక నీ కోడల్నే’ అంటుంది ఏడుస్తూ కాళ్లమీద పడుతుంది. ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ‘ఇగో పెన్విటీ నీ బిడ్డ.. నీ బిడ్డని నీకు అప్పగిస్తున్నా. ఇప్పటినుంచైనా నువ్వు సత్యా, మీ బిడ్డతో సంతోషంగా ఉండండి’ అంటుంది. దేవితో ఈ ఆఫీసర్ సారే మీ నాన్న, మంచి కుటుంబాన్ని ఇచ్చినా,  బాగా చదువుకో, అందరితోనూ మంచిగా ఉండు’ అని దేవిని గుండెలకు హత్తుకుని ఏడ్చేస్తుంది రాధ. రాధ ఆదిత్య, సత్యలను ఉద్దేశించి ఈ రోజు నుంచి మీకు ఇద్దరు బిడ్డలు జాగ్రత్తగా చూసుకోండి’ అంటుంది. ఆదిత్య కాళ్ల పై పడుతుంది రాధ. అప్పుడే పోలీసులు వస్తారు. రాధ వాళ్ల వెంట వెళ్లేప్పుడు ఏడ్చే సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.  పోలీస్ వ్యాన్ ఎక్కుతుంది రాధ. చివరికి దేవత సీరియల్ మాధవ చావుతో ముగించారు.

పార్ట్ 2 ఉండబోతుందని హింట్..

ఇక కొంత కాలం తర్వాత అని చూపిస్తూ, రాధ జైలు నుంచి బయటికి వచ్చి, చిన్మయిని పెంచుకుంటూ భాగ్యమ్మతో కలిసి వ్యవసాయపనులు చేసుకుంటూ ఉంటే, చిన్మయి పొలంలో చదువుకుంటూ ఉంటుంది. రాధ పనులు చేసుకుంటూ కష్టపడుతుంది. అటుగా రోడ్డు మీద వెళ్తున్న ఆదిత్య కారు పక్కకు ఆపుతాడు. అందులోంచి దేవుడమ్మ, సత్య, దేవి, ఆదిత్యలు రాధని ప్రేమగా, కృతజ్ఞతగా చూస్తూ ఉంటారు. అంటే ఆదిత్య కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లుగా కనిపించారు. ఇక  బ్యాగ్రౌండ్‌లో నిరుపమ్ పరిటాల వాయిస్  రుక్మిణీ కోరుకున్నట్లే దేవి తన తండ్రిని చేరుకుంది. అనాథ అయిన  చిన్మయికి అన్నీ తానే అయ్యి నిలించింది. ఐఏఎస్ కావాలనుకున్న దేవి, తండ్రిలా బాగా చదువుకుంటోంది. అమ్మలా కావాలనుకున్న చిన్మయి అమ్మ అడుగులో అడుగు వేస్తుంది. కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ఇది మరో ప్రయాణానికి మొదలు మాత్రమే.. 

ఇవి కూడా చదవండి: