Tamanna: తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్? – ఇకపై నో లవ్, ఓన్లీ ఫ్రెండ్స్ మాత్రమే!

Tamanna and Vijay Varma Break Up: హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మలు రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం గోవాలోని న్యూ ఇయర్ ఈవెంట్‌లో వీరిద్దరు ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అప్పుడే వీరి లవ్ బయటపడింది. ఆ తర్వాత ఈ జంట కూడా దానిని కన్‌ఫాం చేసేసింది. ఇక మిల్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కి సెటిలైపోతుందని అనుకున్నారు.
కానీ, ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే తమన్నా, విజయ్ వర్మలకు బ్రేకప్ అయినట్టు సినీ సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. కొద్దిరోజుల ముందు వరకు వీరిద్దరు జంటగా కనిపించారు. డిన్నర్ డేట్స్,మూవీ ఈవెంట్స్, పార్టీలకు కలిసి హాజరయ్యేవారు. కానీ, కొద్ది రోజులుగా వీరిద్దరు ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లిన సంగిల్‌గా కనిపిస్తున్నారు. దీంతో కొద్ది రోజుల క్రితమే వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని టాక్ నడుస్తోంది. అంతేకాదు తన సోషల్ మీడియాలో ఖాతా నుంచి విజయ్ ఫోటోలు కూడా డిలీట్ చేసిందట.
దీంతో తమన్నా, విజయ్‌ల బ్రేకప్ రూమర్స్ గుప్పుమన్నాయి. ఇది తెలిసి మిల్కీ బ్యూటీ అభిమానులంతా షాక్ అవుతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొద్ది ఆగాల్సిందే. కాగా లస్ట్ స్టోరీస్2 వెబ్ సిరీస్ షూటింగ్ సెట్‌లో తమన్నా, విజయ్ వర్మలకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కొంతకాలం సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్న వీరు 2022లో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు కొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా చేసుకుంటామని కూడా చెప్పారు.
అయితే ఏమైందో ఏమో కానీ, వీరిద్దరు పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకున్నారంట. ప్రేమికులుగా కంటే తాము మంచి ఫ్రెండ్స్‌గా విడిపోదామని నిర్ణయించుకున్నారని వినికిడి. కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుంటారని అనుకున్న వీరు ఇలా బ్రేకప్ చెప్పుకోవడాన్ని ఈ జంట ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె మహిళా అఘోరగా కనిపించబోతోంది. ఇటీవల కుంభమేళలో టీజర్‌ని లాంచ్ చేయగా.. దానికి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాతో భారీ హిట్ కొట్టి మళ్లీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలనే ఆశతో ఉంది తమన్నా.