Last Updated:

Kalpana Raghavendar: పోలీసుల అదుపులో సింగర్‌ కల్పన భర్త – ఆత్మహత్యాయత్నానికి కారణమేంటి?

Kalpana Raghavendar: పోలీసుల అదుపులో సింగర్‌ కల్పన భర్త – ఆత్మహత్యాయత్నానికి కారణమేంటి?

Singer Kalpana Husband in Police Custody: ప్రముఖ సింగర్‌ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెడ్‌పై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మంగళవారం సాయంత్రం పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, తక్కువ మోతాదులో ఆమె స్లీపింగ్‌ పిల్స్‌ తీసుకున్నట్టు వైద్యుల పరీక్షలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ఆమె ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో కల్పన భర్త ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో భాగంగా నగరంలోని కల్పన ఇంటికి ఆయనను తీసుకుని వెళ్లి అక్కడ విచారించారు. అయితే విచారణలో తాను ఇంట్లోనే లేనని, రెండు రోజుల క్రితం కేరళ వెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి ముందు కల్పనకు ఆమె భర్త ప్రభాకర్‌కు ఫోన్‌లో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. మంగళవారం మధ్యాహ్నం కల్పన స్లీపింగ్‌ పిల్స్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆ తర్వాత తన భర్తకు ఫోన్‌ చేసి తాను అపస్మారక స్థితిలోకి వెళుతున్నట్టు చెప్పారు. దీంతో ఆయన గ్రేటెడ్‌ కమ్యునిటీ స్థానికులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఆమె ఇంటికి వచ్చారు. ఇంటిలోపలికి వెళ్లి చూడగా.. బెడ్‌పై అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేరళ వెళ్లిన ఆమె హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరానికి వచ్చిన ఆమెను భర్తను కూకట్‌పల్లిప పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే భర్త, పెద్ద కూతురు ఉన్న వాగ్వాదం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.