Screw Dheela: టైగర్ ష్రాఫ్ -రష్మిక మూవీ టైటిల్ స్క్రూ ధీలా
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత, టైగర్ ష్రాఫ్ రెండవసారి కరణ్ జోహార్ యొక్క ధర్మ ప్రొడక్షన్స్ తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు., శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో అతనికి జంటగా పుష్ప ఫేమ్ నటి రష్మిక మందన్న నటిస్తోంది.
Bollywood: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత, టైగర్ ష్రాఫ్ రెండవసారి కరణ్ జోహార్ యొక్క ధర్మ ప్రొడక్షన్స్ తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు., శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో అతనికి జంటగా పుష్ప ఫేమ్ నటి రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది.
శశాంక్ ఖైతాన్ చిత్రానికి స్క్రూ ధీలా అనే పేరు పెట్టారు. సినిమాలోని టైగర్ ష్రాఫ్ పాత్ర యొక్క లక్షణాల నుండి ఈ టైటిల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ని యూరప్‌లో ప్రారంభించాలని భావిస్తున్నారు. టైగర్, రష్మిక ఇద్దరూ ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు. కరణ్ జోహార్ రాబోయే చిత్రాలలో లిగర్, బ్రహ్మాస్త్ర, గోవింద నామ్ మేరా, మిస్టర్ ఔర్ మిసెస్ మహి మరియు రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ ఉన్నాయి.