Ravi Teja: పనీ పాటాలేని బ్యాచ్ ను పట్టించుకోవద్దు.. రవితేజ
'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా పడినప్పటి నుండి హీరో రవితేజ రీ-షూట్‌ల కోసం నిర్మాత ముందు అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, అందుకే ఆలస్యమవుతుందని అన్ని చోట్లా పుకార్లు వచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో ఈ రెమ్యూనరేషన్ సమస్య గురించి రవితేజను ప్రశ్నించగా అవి కేవలం పుకార్లని కొట్టిపారేసారు.
Tollywood: ‘రామారావు ఆన్ డ్యూటీ’ వాయిదా పడినప్పటి నుండి హీరో రవితేజ రీ-షూట్‌ల కోసం నిర్మాత ముందు అధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, అందుకే ఆలస్యమవుతుందని అన్ని చోట్లా పుకార్లు వచ్చాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరితో ఈ రెమ్యూనరేషన్ సమస్య గురించి రవితేజను ప్రశ్నించగా అవి కేవలం పుకార్లని కొట్టిపారేసారు.
ఈ బ్యాచ్‌కి ఎలాంటి పని లేదు మరియు వారి మనసుకు నచ్చినది వ్రాస్తారు. పని పాట లేని బ్యాచ్ ఉంటుంది. వాటిని పట్టించుకోకండని రవితేజ చెప్పారు. దర్శకుడు శరత్ మండవతో కలసి పోస్టర్‌పై ఉన్న ఆర్‌టి వర్క్స్ లోగోను చూపిస్తూ, ఆర్‌టి వర్క్స్ లోగో ఉన్నప్పుడు, ఈ చిత్రానికి నేను కూడా నిర్మాతనే అని క్లారిటీ వస్తోంది మరి రెమ్యునరేషన్ సమస్య ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుదలవుతోంది. ఖిలాడీ పరాజయం తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో రవితేజ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.