Prabhas: ఫిష్ వెంకట్ కు అండగా హీరో ప్రభాస్

Prabhas team call To Fish venkat Family: టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఫిష్ వెంకట్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు షుగర్, బీసీతో బాధపడుతున్నాడు. అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం మరింతగా విషమించడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తన తండ్రి అనారోగ్యం గురించి చెప్తూ ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి ఓ వీడియో ద్వారా వేడుకుంది. దీనిపై స్పందించి ‘హీరో ప్రభాస్ అసిస్టెంట్ అని ఒకరు కాల్ చేశారు. ఎవరైనా కిడ్నీ ఇచ్చే డోనర్ ను వెతకండి. మీ నాన్నగారి ఆపరేషన్ కు కావల్సిన రూ. 50 లక్షలు మేము ఏర్పాటు చేస్తాం అని’ చెప్పినట్టు స్రవంతి చెప్పింది. అయితే ఫిష్ వెంకట్ భార్య దీనిపై మాట్లాడారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ తప్ప ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ రాలేదు, ఫోన్ చేయలేదని చెప్పినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ టీమ్ కాల్ చేసింది నిజమేనని తేలింది. డోనర్ దొరికితే అందుకు తగిన సాయం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.