Kannappa: ‘కన్నప్ప’ మూవీ చేయడం సాహసమే.. ప్రముఖ రచయిత పరుచూరి ప్రశంసలు

Paruchuri Gopala Krishna About Kannappa Movie: టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, శివబాలాజీ, బ్రహ్మాజీ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.
తాజాగా, ఈ సినిమాపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఈ మూవీపై ఆయన అభిప్రాయాలను ప్రత్యేక వీడియోలో చెప్పారు. ఇప్పటికే తెలిసిన కథను ప్రేక్షకులకు అందించడం సాహసమేనని చెప్పారు. మోహన్ బాబు అద్భుతంగా నటించారని కొనియాడారు. అలాగే కన్నప్పకు ప్రభాస్ అండగా నిలిచారని, ఇలాంటి పాత్రలు చేయడం ఆయన గొప్పతనమని పేర్కొన్నారు. ప్రధానంగా మోహన్ బాబు నమ్మకాన్ని మంచు విష్ణు నిలబెట్టుకున్నారని చెప్పారు.