Last Updated:

Bro Movie : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “బ్రో” మూవీ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై 

Bro Movie : పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “బ్రో” మూవీ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..?

Bro Movie : మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన పవన్, సాయి పోస్టర్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే రిలీజ్ చేసిన తేయాసర్ అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

కాగా తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. మై డియర్ మార్కండేయ అంటూ ఈ పాట ఉండనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్, తేజు ఫ్లోర్ అదిరిపోయేలా డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఫోటోలో ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ గా ఉన్నారు.

 

 

ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలానే ఈ సినిమాలో కేతిక శర్మ.. సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమా స్టోరీగా తెలుస్తుంది. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేయనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. దీంతో పవన్ దేవుడి పాత్రలో నటించడం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’లో.. పవన్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. కానీ,అందులో కూడా మోడ్రన్ దేవుడిలానే దర్శనమిచ్చాడు. ఈ మూవీతో మామ – అల్లుళ్ళు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.