Last Updated:

Pawan kalyan : బాక్స్ లు బద్దలయ్యేలా పవన్ కళ్యాణ్ “ఓజీ” టీజర్.. యూట్యూబ్ ఊచకోత !

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్. కాగా నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పవన్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ తరుణంలోనే ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన

Pawan kalyan : బాక్స్ లు బద్దలయ్యేలా పవన్ కళ్యాణ్ “ఓజీ” టీజర్.. యూట్యూబ్ ఊచకోత !

Pawan kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్. కాగా నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పవన్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ తరుణంలోనే ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వరుసగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా సుజీత్‌ దర్శకత్వంలో రానున్న “ఓజీ” మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్ (Pawan kalyan) గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో కనిపించనున్నారని తెలియనడంతో దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా ఏదో అద్భుతం సృష్టిస్తున్నాడని.. మళ్ళీ ఫ్యాన్స్ బాయ్ మూమెంట్ ని క్రియేట్ చేస్తాడని ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ అంచనాలను మరింత రెట్టింపు చేస్తూ తాజాగా వచ్చిన టీజర్ మోత మోగిస్తుంది. టీజర్ ఆధ్యంతం అద్భుతం అనే చెప్పాలి. ఆ వీడియోని గమనిస్తే.. ముంబై మాఫియా  బ్యాక్ డ్రాప్.. పవన్ కళ్యాణ్ విధ్వంసానికి తోడు అర్జున్ దాస్ పవర్ ఫుల్ వాయిస్ తో ఇస్తున్న టీజర్ అదిరిపోయింది అని చెప్పాలి.

పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాన్ కడగలేకపోయింది. అది ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అంటూ అర్జున్ దాస్ పవన్ కి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ టీజర్ లో.. పవన్ కళ్యాణ్ లుక్స్, మేనరిజం, ఆ స్వాగ్ ఫ్యాన్స్ ని కట్టిపడేసే విధంగా ఉన్నాయి.

వీటిని డబుల్ చేస్తూ సుజిత్ టేకింగ్, తమన్ మ్యూజిక్ అదుర్స్ అనిపించాయి. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. అందరూ కాలర్ ఎగరేసేలా ఈ టీజర్ ఉందని చెప్పాలి. అయితే ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నారు. తమిళ్ నటుడు అర్జున్ దాస్, శ్రీయారెడ్డిలు, మరి కొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.