Last Updated:

Pathaan: బాహుబలి-2 రికార్డ్ బద్దలు కొట్టిన పఠాన్.. టాప్‌-1లో కింగ్ ఖాన్

Pathaan: పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది.

Pathaan: బాహుబలి-2 రికార్డ్ బద్దలు కొట్టిన పఠాన్.. టాప్‌-1లో కింగ్ ఖాన్

Pathaan: షారుఖ్‌ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన పఠాన్ మూవీ హిందీలో బాహుబలి2 రికార్డులను బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఇది వరకే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా మరో రికార్డును బద్దలు కొట్టింది.

బాహుబలి రికార్డు బద్దలు.. (Pathaan)

పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది. విడుదలైన నెలరోజుల్లోనే అన్ని భాషల్లోనూ కలిపి ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా హిందీలో రూ.511.70 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. బాహుబలి రూ.510.99 కోట్లను రాబట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో కేజీయఫ్‌2, ఆమిర్‌ఖాన్‌ల దంగల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తమిళంలో పఠాన్‌ రూ.18.26కోట్లు వసూలు చేయగా, మొత్తం హిందీతో కలిపి రూ.529.96 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఓటీటీలోకి పఠాన్..

బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న పఠాన్‌ ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది. సినీ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఏప్రిల్‌ చివరిలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లు.. యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ ప్రకటించింది.

వివాదాల మధ్య విడుదలైన పఠాన్..

భారీ వివాదాల నడుమ.. బాలీవుడు కింగ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య విడుదలై.. సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా వసూళ్లలో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే వరుస ప్లాపులతో కుగిపోయిన బాలీవుడ్ సినిమాకు.. పఠాన్ ప్రాణం పోసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. భారీ అంచనాల మధ్య గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 25న విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో షారుక్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించాడు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు.. తొలిరోజు నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి పెద్ద సినిమా లేకపోవడంతో.. ఆడియెన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యాక.. బాలీవుడ్‌లో మరే ఇతర పెద్ద సినిమా రాకపోవడం ఈ సినిమాకు కలిసివచ్చింది. ఇక ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా.. ఈ సినిమాకు అడిక్ట్ అవుతున్నారు. ఈ సినిమా అక్కడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరినట్లు యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ పేర్కొంది. ఈ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున వ్యతిరేకత చోటు చేసుకుంది. దీంతో పెట్టిన బడ్జెట్ ని అయినా రాబట్ట గలదా? అని సందేహించారు. కానీ ఆ అనుమానాలను పటాపంచెలు చేస్తూ.. సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా భారీ విజయంతో.. ఇప్పుడు బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకువచ్చింది.

ఈ సినిమాపై మెుదట్లో వ్యతిరేకత రావడంతో.. టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ కలెక్షన్స్ సాధించిన మొదటి హిందీ చిత్రంగా పఠాన్ రికార్డులకెక్కింది. బాలీవుడ్ కింగ్ ఖాన్.. నటించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఫుల్ యాక్షన్ స్వింగ్‏లో షారుఖ్ ఇందులో నటించాడు.