Last Updated:

Nandamuri Kalyan Ram: విజయశాంతి మొక్కు బయటపెట్టిన కళ్యాణ్ రామ్.. అదేంటంటే..?

Nandamuri Kalyan Ram: విజయశాంతి మొక్కు బయటపెట్టిన కళ్యాణ్ రామ్.. అదేంటంటే..?

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు.  ఆ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్, డెవిల్ సినిమాలు పరాజయాన్ని అందుకున్నాయి. మధ్యలో ఈ కుర్ర హీరో నిర్మాత కూడా కావడంతో తమ్మడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తనకు అచ్చి వచ్చిన యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు.

 

నందమూరి కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టైటిల్ రోల్ పోషిస్తుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ అంచనాలు బాగా పెట్టుకున్నారు.

 

ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్  రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి కళ్యాణ్ రామ్.. విజయశాంతి మొక్కు గురించి రివీల్ చేశాడు.

 

” ఈ కథ విన్నప్పుడు విజయశాంతి అమ్మ ఒప్పుకుంటేనే చేద్దాం అని చెప్పాను. చిన్నప్పుడు నేను సూర్య IPS సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఆమె నన్ను సొంత బిడ్డలా చూసుకుంది.  ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజు కాలినడకన తిరుపతికి వెళ్తున్నాం. స్వామివారిని దర్శించుకుంటున్నాం. అప్పటివరకు ఆమె నాన్ వెజ్ తినను అని చెప్పారు. సినిమా హిట్ అయినతరువాత చేపల పులుసు అమ్మకు నేనే స్వయంగా తీసుకెళ్తాను” అని చెప్పుకొచ్చాడు.

 

ఇక విజయశాంతి మాట్లాడుతూ.. తనలో ఇంకా అదే పౌరుషం, రోషం ఉందని చెప్పుకొచ్చింది. సినిమా కథ విన్న వెంటనే కొత్త అనుభూతి వచ్చిందని, సెట్ లో యాక్షన్ సీన్స్ సింగిల్ షాట్ లో చేసేసరికి అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యినట్లు తెలిపింది. అప్పుడప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపిన విజయశాంతి ఈ సినిమాను ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకుల మీద ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్, విజయశాంతి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.