Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతకు అస్వస్థత
తాజాగా సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

Mythri Movie Makers: తెలుగు చిత్రసీమ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు కొనసాగతున్న విషయం తెలిసిదే. ఈ సంస్థ వ్యాపార లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల్లో భారీ తేడాలు ఉన్నాయనే సమాచారంతో కేంద్ర, రాష్ర్ట జీఎస్టీ , ఐటీ అధికారులు మైత్రీ ఆఫీస్ పై సోదాలు నిర్వహించారు. అదే విధంగా ఆ సంస్థ అధినేతలు అయిన సినీ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ ఇళ్లల్లోనూ సోదాలు చేశారు.
హుటాహుటిన హాస్పిటల్ కు(Mythri Movie Makers)
అయితే, తాజాగా సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు. బీపీ ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనను త్వరలోనే డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా మైత్రీ మూవీ ఆఫీస్, నిర్మాతల ఇళ్లతో పాటు డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా
ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాల నిర్మాణానికి విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా తీసుకోవడంతో పాటు వాటికి సంబంధించి పన్నుల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుస ఐటీ రైట్స్ నేపథ్యంలో నిర్మాత నవీన్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
2015లో ప్రారంభమైన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, ఉప్పెన, పుష్ప, సర్కారు వారి పాట, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. ప్రస్తుతం పుష్ప2 తో పాటు మరికొన్ని సినిమాలు ఈ బ్యానర్ లో నిర్మాణం అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- Ganji Benefits: గంజి వల్ల లాభాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
- Russia city: సొంత నగరంపైనే బాంబు దాడి చేసుకున్న రష్యా