Last Updated:

Sanjay Dutt : సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్.. ఆ మూవీస్ నుంచి అదిరిపోయే అప్డేట్స్

ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తూ స్టార్ హీరోలకొచ్చిన క్రేజూ, ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో తన విలనిజంతో అదరగొట్టేశారు.

Sanjay Dutt : సంజయ్ దత్ బర్త్ డే స్పెషల్.. ఆ మూవీస్ నుంచి అదిరిపోయే అప్డేట్స్

Sanjay Dutt : ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తూ స్టార్ హీరోలకొచ్చిన క్రేజూ, ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో తన విలనిజంతో అదరగొట్టేశారు. అయితే సంజయ్ దత్ సౌత్ లో పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నేడు సంజయ్ దత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయా సినిమాల నుంచి దుమ్మురేపే అప్డేట్స్ ఇచ్చారు.

ముందుగా వాటిలో దళపతి విజయ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం లియో. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా క‌నిపించ‌నుంది. విల‌న్‌గా సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఆయ‌న‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియోను మూవీ యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియోని గమనిస్తే.. ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్ ఆంటోని దాస్‌గా క‌నిపించ‌నున్నాడని తెలుస్తుంది. ఆంటోని లుక్ రివీల్‌ చేస్తూ వీడియో విడుద‌ల చేయ‌గా బ్యా గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. చాలా స్టైలిష్ విల‌న్‌గా సంజ‌య్ ద‌త్ క‌నిపిస్తున్నాడు. సిగ‌రేట్ తాగుతూ, ఫోన్ మాట్లాడుతూ స‌లామ్ చేస్తున్న‌ట్లుగా ఉన్న ఆంటోని లుక్ వైర‌ల్‌గా మారింది.

 

 

ఇక అదే విధంగా తనకు రామ్ పోతినేని హీరోగా.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి ఇది సీక్వెల్ గా రానుంది. ఈ మూవీకి కూడా పూరి, ఛార్మి నిర్మాతలుగా ఉన్నారు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. ఈ మూవీలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తున్నట్లు ఈ టీం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన (Sanjay Dutt) క్యారెక్టర్ పేరు బిగ్ బుల్.. అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ లుక్ లో సూట్ ధరించి, సిగార్ తాగుతూ మాఫియా డాన్ గెటప్ లో సంజయ్ దత్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.