Last Updated:

Jana Nayagan: విజయ్ చివరి సినిమా.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా.. ?

Jana Nayagan: విజయ్ చివరి సినిమా.. డిజిటల్ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా.. ?

Jana Nayagan: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే కొత్త పార్టీని స్థాపించిన విజయ్.. ప్రజలకు సేవ చేయడం కోసం.. సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పుకొచ్చాడు. ఇక ఫ్యాన్స్ కోసం చివరిగా ఒక్క సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ది గోట్ సినిమానే చివరిది అని చెప్పుకొచ్చినా.. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ది గోట్ తరువాత ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయాలనీ విజయ్ కోరుకున్నాడు. అనుకున్నట్లుగానే అలాంటి కథతో వచ్చాడు డైరెక్టర్ హెచ్ వినోద్.

 

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాను విజయ్ కు వినిపించడం.. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి విజయ్ తో ఒక సినిమా మొదలుపెట్టాడు. ఆ సినిమానే జన నాయగన్. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

 

ఇక  సినిమా రిలీజ్ కు ముందే జన నాయగన్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. అది కూడా కళ్లు చెదిరే ధరకు. దాదాపు రూ.121 కోట్లు చెల్లించి.. జన నాయగన్ ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు విజయ్ కు ఉన్న  మార్కెట్ కు ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే గత కొంతకాలంగా విజయ్ కు ఒక్క మంచి హిట్ కూడా వచ్చింది లేదు.

 

అయితే విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాకు అంత భారీ ధర వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఈ సినిమా పూర్తికాకముందే డిజిటల్ రైట్స్ ఈ రేంజ్ లో అమ్ముడుపోయాయి అంటే రిలీజ్ టైం కి బాబాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని చెప్పుకొస్తున్నారు.  మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఒకవేళ నిజం అయితే మాత్రం విజయ్ చివరి సినిమా ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో అయినా  దళపతి ఫ్యాన్స్ ను మెప్పిస్తాడో లేదో చూడాలి.