Published On:

Srisailam: శ్రీశైలంలో ప్రారంభమైన స్పర్శ దర్శనాలు

Srisailam: శ్రీశైలంలో ప్రారంభమైన స్పర్శ దర్శనాలు

Sparsha Darshanam In Srisailam: శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉచిత స్పర్శదర్శనాలను నిన్నటి నుంచి దేవస్థానం ప్రారంభించింది. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఈ సేవను తిరిగి ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పర్శదర్శనం కోసం అధికారులు కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీశైలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను ఆఫ్ లైన్ లో జారీ చేస్తారు. టోకెన్ పొందాలనుకునే భక్తులు తమ పేరు, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దర్శనానికి వెళ్లే ముందు ఈ టోకెన్లను స్కాన్ చేశాకే భక్తులను లోపలికి అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. దీని వల్ల భక్తుల రద్దీన నియంత్రించడం సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు.

గతంలో అమలు చేసిన విధంగానే ఇక్కడ కూడా నాలుగు రోజుల పాటు ఈ సేవను అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 1.45 గంటల నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకు స్పర్శదర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. భక్తుల కోరిక మేరకు ప్రతి ఒక్కరూ మల్లికార్జున స్వామివారిని స్వయంగా స్పృశించి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ వివరించారు. ఏడాది విరామం తర్వాత ఈ సేవలు పునఃప్రారంభంకావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి: