Keerthy Suresh: గోవాలో కీర్తి సురేష్ పెళ్లి – ఫోటో షేర్ చేసిన హీరోయిన్!
Keerthy Suresh Pre Wedding: ‘మహానటి’ కీర్తి సురేష్ పెళ్లి పనులు సైలెంట్‌గా జరుగుతున్నాయి. గోవాలో ఆమె పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో రేపు ఏడడుగులు వేయబోతున్నట్టు సినీవర్గాల నుంచి సమాచారం. గోవాలో జరిగే వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం బంధుమిత్రులు మెల్లిమెల్లిగా అక్కడి చేరుకుంటున్నారు. అయితే కీర్తి పెళ్లి వేడుకలకు సంబంధించి ఫోటోలు బయటకు రావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండ ఆమె పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని సన్నిహితుల నుంచి సమాచారం. ఈ క్రమంలో కీర్తి పెళ్లి వేడుకలకు సంబంధించి ఫోటోలు, వీడియోల కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో కీర్తినే స్వయంగా తన వెడ్డింగ్‌కి సంబంధించి ఓ ఫోటో షేర్ చేసింది. అయితే ఇక్కడ ఫ్యాన్స్‌కి ఓ ట్విస్ట్ ఇచ్చింది. ఇందులో తన లుక్ రివీల్ అవ్వకుండ జాగ్రత్త పడింది. కిట్టి అని తన డ్రెస్ వెనకాల రాసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ ‘హియర్ వీ గో.. మ్యాడ్‌నెస్ బిగెన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చూస్తుంటే ఇది ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటో అనిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్ పెళ్లి కూతురిగా ముస్తాబవుతున్న ఫోటో. ఇందులో కిట్టి అని అని డిజైన్ చేయించిన గౌన్ ధరించి ఉంది. బ్యాక్ నుంచి ఈ ఫోటో షేర్ చేయడంతో ఫ్యాన్స్ కాస్తా డిస్సపాయింట్ అవుతున్నారు.
ఏదేమైన ఎట్టకేలకు కీర్తి పెళ్లికి సంబంధించి ఓ ఫోటో వచ్చేసిందేలా అని సరిపెట్టుకుంటున్నారు. కాగా కీర్తి పెళ్లి రేపు జరగనుందని తెలుస్తోంది. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొద్దిమంది ఇండస్ట్రీకి చెందిన వారు ఈ వేడుకకు హాజరుకానున్నారు. కాగా ఇటీవల కీర్తి తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనిని పరిచయం చేస్తూ పెళ్లి కబురు చెప్పింది. 15 ఏళ్లుగా ఆంటోనితో ప్రేమలో మునిగితేలిన కీర్తి తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ని ఎప్పుడు బయటకు చెప్పలేదు. ఈ క్రమంలో ఆమె బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేయడంతో అంతా షాక్ అయ్యారు.