SBI FD Interest Rates Reduced: ఎస్‌బీఐ కస్టమర్లకు మరో బిగ్ షాక్.. ఎఫ్‌డీ రేట్లు మళ్లీ తగ్గింపు!
SBI Cut the Fixed Deposit Interests Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) ఇటీవల రెపో రేటు తగ్గించగా.. ఎస్బీఐ వెంటనే వడ్డీ రేట్ల తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. కాగా, ఆర్బీఐ రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత చాలా బ్యాంకులు ఎఫ్‌డీ వడ్డీ రేట్లను తగ్గించాయి.
అయితే, దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా. ఇందులో ఎఫ్‌డీ కింద ‘అమృత్ వృష్టి’ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ఈ వడ్డీరేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలపగా.. నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), కెనరా బ్యాంక్‌లు సహా ఇతర బ్యాంకులు కూడా ఎఫ్‌డీ వడ్డీ రేట్లను తగ్గించాయి.
‘అమృత్ వృష్టి’ ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద వడ్డీ రేట్లను 25 శాతం బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే గతంలో సాధారణ వినియోగదారులు 444 రోజుల ఎఫ్‌డీపై 6.85 శాతం వార్షిక వడ్డీని పొందేవారు. తాజాగా, 6.60 శాతం తగ్గింది. ఈ కొత్త రేట్లు నేటి అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ వెబ్ సైట్ లో పొందుపర్చింది.
ఇక, ఎస్బీఐ ‘అమృత్ వృష్టి’ ఎఫ్‌డీ పథకంలో సీనియర్ సిటిజన్లు ఎక్కువగా వడ్డీ పొందుతున్నారు. ఏడాదికి 7.10 శాతం నిర్ణయించగా.. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సూపర్ సీనియర్ సిటిజన్లు మాత్రం 7.20 శాతంవడ్డీ పొందుతున్నారు.
ఇదిలా ఉండగా, ఎఫ్‌డీలో ఉన్న నగదును మెచ్చూరిటీ కంటే ముందుగానే రద్దు చేసుకొని నగదు తీసుకుంటే జరిమానా పడుతుంది. రూ.5లక్షల వరకు ఉన్న ఎఫ్‌డీ నుంచి డబ్బును తీసుకుంటే 0.50 శాతం జరిమానా వడ్డీ పడుతుంది. అలాగే రూ,5 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ఎఫ్‌డీపై 1 శాతం జరిమానా ఉంటుంది.
ఇక, కస్టమర్ డిపాజిట్ 7 రోజుల కంటే తక్కువ కాలం బ్యాంకులో ఉంటే.. ఈ మొత్తంపై ఎలాంటి వడ్డీ చెల్లించదు. సాధారణ కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి 3.30 శాతం నుంచి 6.70 శాతం వరకు వడ్డీని పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.80 శాతం నుంచి 7.30 శాతం వరకు వచ్చే అవకాశం ఉంటుంది.