Jabardasth Varsha: నాకు ఇలాంటి జన్మ వద్దు.. ఆరోజు గుడిసెలో వాళ్లు చేసిన పని..

Jabardasth Varsha: నేమ్, ఫేమ్ అన్నవి అంత త్వరగా రావు. ప్రతి ఒక్కరు వాటికోసమే ఆరాటపడుతూ ఉంటారు. కానీ, అవి వచ్చాకా.. కొందరు వాటివలనే ఇబ్బంది పడుతుంటారు. ఇండస్ట్రీలో పైకి కనిపించేది ఏది నిజం కాదు. ప్రతి ఒక్కరి వెనుక ఒక చీకటి కోణం ఉంటుంది. దాన్ని దాచిపెట్టి కెమెరా ముందుకు నవ్వుతు అందరినీ అలరిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలలో ఆ చేదు జ్ఞాపకాలను బయటపెడుతుంటారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్ష కూడా తన జీవితంలో జరిగిన ఒక సంఘటన వలన అసలు ఈ జన్మ ఎందుకు ఇచ్చావ్ దేవుడా.. ? అని బాధపడిందట. అదేంటో చూద్దాం.
సీరియల్ ఆర్టిస్ట్ గా వర్ష బుల్లితెరపై కెరీర్ ను ప్రారంభించింది వర్ష . ప్రేమ ఎంత మధురం సీరియల్ ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ గుర్తింపుతోనే జబర్దస్త్ లో అప్పుడప్పుడు కొన్ని స్కిట్స్ లో కనిపించింది. అలా ఇమ్మాన్యుయేల్ తో చేసిన ఒక స్కిట్ వైరల్ గా మారడంతో వర్ష జీవితం మొత్తం మారిపోయింది.
ఆ తరువాత వరుస షోస్ తో వర్ష బిజీగా మారింది. సీరియల్స్ మానేసి పూర్తిగా షోస్, ఈవెంట్స్ అంటూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తుంది. ఇక ప్రస్తుతం వరుస షోస్ తో బిజీగా ఉన్న వర్ష ఒక ఇంటర్వ్యూలో ఎవరు ఈ ఫీల్డ్ లోకి రావద్దు అని చెప్పుకొస్తుంది. ” నేను చాలా తక్కువ సమయంలోనే నేమ్, ఫేమ్, డబ్బు సంపాదించుకున్నాను. అలా నాకు పేరు రావడంతో మనుషుల్లో రెండు ముఖాలు చూసాను. నా ముందు నన్ను పొగిడినవారే.. నా వెనుక నన్ను తిట్టడం మొదలుపెట్టారు.
సీరియల్ నుంచి జబర్దస్త్ షోకు వచ్చినప్పుడు అందరు నన్ను ప్రోత్సహించారు. నేను ఒక్కసారిగా ఫేమస్ అయ్యాకా వారిలో మార్పు గమనించాను. స్కిట్స్ లో వారు నన్ను తిట్టినా నేను అంతగా పట్టించుకోలేదు. కానీ, అవి వారు కావాలనే తిట్టారని.. నన్ను ఎదురుగా అనలేక అలా స్కిట్స్ లో డైలాగ్స్ రూపంలో తిట్టేవారని తెలిసి తట్టుకోలేకపోయాను. ఛీఛీ ఇదేనా బతుకు. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు. అడుక్కొనేవారింట్లో పుట్టించిన బావుండేది. డబ్బు, పేరు అన్ని ఉన్నా సుఖం లేదు అనిపించింది. ఇలాంటి జీవితం నాకు వద్దు అనిపించింది. మళ్లీ ఇలా పుట్టాలని కోరుకోవడం లేదు.
కెరీర్ మొదట్లో కూడా నాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కావాలనే నన్ను ఈవెంట్ కు పిలిచి అవమానించేవారు. ఏడేళ్ల క్రితం నన్ను ఒక ఈవెంట్ కు పిలిచారు. నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్లాను. అక్కడ ఎలాంటి వసతులు లేవు. స్టేజిమీద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దాని వెనుకాల ఒక గుడిసెలాంటింది ఉంటే.. అందులో నన్ను కూర్చోమన్నారు.
స్టేజిమీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారు.. వస్తున్నారు. ఎంతసేపటికీ నన్ను పిలవలేదు. అక్కడ ప్రోగ్రామ్ చేసే ఒక ఆర్టిస్ట్ గుడిసెలోకి వచ్చి.. మేకప్ వేసుకుంటాను, మీరు ఖాళీగానే ఉన్నారుగా కొంచెం అద్దం పట్టుకోమని అడిగింది. అలా నేను గంటసేపు అద్దం పట్టుకొని కూర్చున్నాను. ఈవెంట్ అయిపోయింది. నన్ను కావాలనే పిలవకుండా అవమానించారు. అప్పుడెంతో బాధపడ్డాను” అని వర్ష కన్నీటిపర్యంతమయ్యింది.