Last Updated:

Allu Arjun: పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్.. దానికోసమేనా.. ?

Allu Arjun: పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్.. దానికోసమేనా.. ?

Allu Arjun: ఇండస్ట్రీలో పేర్లు మార్చుకోవడం కొత్తేమి కాదు. సక్సెస్ రాకపోయినా లేక జాతకంలో దోషాలు ఉన్నా.. చాలామంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది తమ పేర్లలో కొన్ని అక్షరాలను యాడ్ చేయడం కానీ, అక్షరాలు తొలగించడం కానీ చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తన పేరులో ఉన్న ధరమ్ ను తొలగించి తన తల్లి పేరు అయిన దుర్గను యాడ్ చేసి సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు. ఇక చాలామంది హీరోలు, హీరోయిన్లు.. తమ పేరులో ఎక్స్ట్రా లెటర్ ను యాడ్ చేసుకున్నారు.

 

తాజాగా ఇదే పద్దతిని అల్లు అర్జున్ కూడా చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కు గతేడాది అస్సలు కలిసిరాలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గతేడాది మొదట రాజకీయ పర్యటన అప్పుడు మొదలైన వివాదాలు.. డిసెంబర్ పుష్ప 2 రిలీజ్ అయ్యాకా కూడా తగ్గలేదు. ఒకటా.. రెండా..  ఎప్పుడు లేనివిధంగా బన్నీ జైలు జీవితాన్ని కూడా రుచి చూసాడు. గుడ్డిలో మెల్ల లాగా.. పుష్ప 2 హిట్ అవ్వడంతో సినిమాపై ఎలాంటి ఇంపాక్ట్ అవ్వలేదు. లేకపోతే అది కూడా ఒక పెద్ద మైనస్ అయ్యేది.

 

మెగా ఫ్యామిలీ కన్నా అల్లు ఫ్యామిలీ ఎక్కువ హైప్ తెచ్చుకోవాలని.. మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ బయటపడాలని తాపత్రయపడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే బన్నీ అడుగులు కూడా పడుతున్నాయని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అందుకే ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట. జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే తొలగించుకోవడానికి, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి.. తన పేరులో ఒక లెటర్ ను యాడ్ చేయించుకోవాలని చూస్తున్నాడట.

 

Allu Arjun పేరులో కొత్తగా మరొక U  ని కానీ.. మరొక N ని కానీ యాడ్ చేయాలనీ చూస్తున్నాడట. దీని వలన తన లైఫ్ లో భారీ ఛేంజెస్ జరుగుతాయని పండితులు చెప్పినట్లు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇక బన్నీ కెరీర్ విషయానికొస్తే పుష్ప 2 తరువాత ఆయన.. త్రివిక్రమ్ తో కలిసి AA22 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ జోనర్ లో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇక AA 22 తో పాటు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మొన్నటివరకు ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం  ఎట్టకేలకు ఈ కాంబో కూడా సెట్ అయ్యిందని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. మరి ఈ సినిమాలతో బన్నీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు..? పేరులో లెటర్స్ యాడ్ చేయడం వలన బన్నీ లైఫ్ మారుతుందా.. ? అనేది చూడాలి.