Bhagavanth Kesari : బాలయ్య “భగవంత్ కేసరి” నుంచి “గణేశ్ ఆంథెమ్” ప్రోమో రిలీజ్..
బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. విజయ దశమి కానుకగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండడం మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సైతం బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించడంతో ఈ మూవీపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రిలీజ్ డేట్ దగగ్ర పడుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమోని నేడు తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఈ సాంగ్ లో శ్రీలీల అండ్ బాలయ్య కలిసి తీన్మార్ ఆడనున్నారని అర్ధం అవుతుంది. దాంతో అభిమానులకు ఈ సాంగ్ పూనకాలు తెప్పించడం గ్యారంటీ అని భావిస్తున్నారు.
కాసర్ల శ్యామ్ ఈ పాటకి లిరిక్స్ అందించగా కరీముల్లా, మనీష్ పండ్రంకి పాడారు. శేఖర్ మాస్టర్ గ్రాండ్ విజువల్స్ తో డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. పూర్తి సాంగ్ ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. బాలయ్య గత చిత్రాలు అఖండ, వీర సింహరెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీ పై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి అనిల్ రావిపూడి బాలయ్యకి హ్యాట్రిక్ హిట్టుని అందిస్తాడో లేదో చూడాలి.