Home / సినిమా వార్తలు
దర్శకధీరుడు రాజమౌళి భారతదేశంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఫిల్ డైరక్టర్ గా నిలిచాడు."RRR" చిత్రం కోసం అతను సుమారుగా రూ.100 కోట్లను తీసుకున్నాడని సమచారం. రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా రాజమౌళి సినిమా వ్యాపారంలో కూడా వాటా తీసుకుంటున్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ గురించి అందరికీ తెలిసిందే. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత బన్నీ అదితి అగర్వాల్‌ను కలిశాడు. అమెరికాలో గంగోత్రి జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన ద్విభాషా చిత్రం 'ది వారియర్'కి ఇటీవల దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు ఎన్ లింగుసామికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్ కాంబోలో వస్తున్నచిత్రానికి జైలర్ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు.
విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం లైగర్ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీలో 150 పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ నిర్వహించాడు. లేటెస్ట్గా రాబోయే సినిమాతో హీరోగా మారాడు. యథా రాజా తథా ప్రజ అనే టైటిల్ తో జానీ మాస్టర్ కొత్త చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు వసూలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. . తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు.
ఆయన జీవితంలోని ప్రతి పేజీ ఎందరో నటులకు ఆదర్శం. కుమారుడిగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా తన జీవితంలో పోషించిన ప్రతి పాత్ర ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చింది. పట్టుదలతో అంచెలంచెలుగా పైకెదిగిన ఆయన సినీ ప్రస్థానం
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘లైగర్’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను ఆగస్ట్ 25న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.