HBD Chiranjeevi: నేను ప్రేమించే నా ప్రియమైన సోదరుడికి.. పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. . తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు.
Tollywood: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తాజాగా జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పారు. నా ప్రియమైన సోదరుడికి అంటూ ఆయన ట్వీట్ చేశారు.
నేను ప్రేమించే, గౌరవించే, ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను’ అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు. అన్నయ్య, తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు అంటూ మరో నోట్ లో పవన్ కళ్యాణ్ తెలిపారు.