Home / సినిమా వార్తలు
దర్శకుడు సుకుమార్‌తో గతంలో విజయ్ దేవరకొండ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్ పైకి రాలేకపోయింది.విజయ్ తన ప్రాజెక్ట్స్ లైగర్, కుషి మరియు జన గణ మనతో బిజీగా ఉండగా, సుకుమార్ తన చిత్రం పుష్ప 2 కోసం పని చేస్తున్నాడు.
నటి నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరు. తెలుగులో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ’సొంతం’, ‘జెమిని’, ‘ఒకరాజు-ఒక రాణి’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నమిత కవలలకు జన్మనిచ్చింది.
నందమూరి మోక్షజ్ఞ తాజా ఫోటో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్‌తో కలిసి మోక్షజ్ఞ కనిపించాడు.
విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీమ్ ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
హీరో నిఖిల్ సిద్ధార్థ యొక్క కార్తికేయ 2 తెలుగు మరియు హిందీ బెల్ట్లలో బాక్పాఫీసు వద్ద తుఫాను సృష్టిస్తోంది. ట్రేడ్ పండితులని ఆశ్చర్యానికి గురిచేస్తూ మొదటి రోజు 60 స్క్రీన్ల నుండి 6వ రోజు 1000+ స్క్రీన్ల వరకు విస్తరించింది.
సల్మాన్ ఖాన్ మరియు సోమీ అలీ దాదాపు ఒక దశాబ్దం పాటు రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారు అనేక ప్రకటనలలో కలిసి కనిపించారు. కలిసి ఒక చిత్రానికి సంతకం చేశారు. అయితే అది నిలిచిపోయింది. తరువాత వారిద్దరు విడిపోయారు.
నటి, నిర్మాత మంచు లక్ష్మి టిసి క్యాండ్లర్ ద్వారా 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ జాబితాలో నామినేట్ చేయబడింది. ఈ జాబితాలో 40 దేశాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు, ఈ గ్లోబల్ లిస్ట్‌లో ర్యాన్ రేనాల్డ్స్, బెయోన్స్, టామ్ హార్డీ, షాన్ మెండిస్
ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపివేసిన తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినిమాను, థియేట్రికల్ వ్యాపారాన్ని కాపాడేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా థియేటర్లలో విడుదలైన 8 వారాల్లోగా ఓటీటీలో సినిమాను
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ధమాకా చిత్రం నుంచి నిర్మాతలు జింతాక్ అనే మాస్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ పాటలో రవితేజ, శ్రీలీలల మేకోవర్, మాస్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
నాచురల్ స్టార్ నాని, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరి కెరియర్లో ఉన్న బెస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు.