Trinadha Rao Nakkina: ‘మజాకా’తో సూపర్ హిట్, అప్పుడే మరో యంగ్ హీరోని లైన్‌లో పెట్టిన త్రినాథరావు నక్కిన

Trinadha Rao Next Movie: ‘మజాకా’ హాట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. యంగ్ హీరో సందీప్ కిషన్, నటుడు రావు రమేష్‌లు ప్రధాన పాత్రలో ‘మజాకా’ చిత్రాన్ని తెరకెక్కించారు. శివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. సినిమా చుపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా వంటి సినిమాలు తెరకెక్కించి వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా మజాకాతో మరోక బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వరుస హిట్స్‌తో హిట్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు.
కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్లతో సినిమాలు తీసి బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్న ఆయన తాజాగా ఓ యంగ్ హీరోని లైన్‌లో పెట్టాడు. ప్రామిసింగ్ యువ హీరో హవీష్ కోనేరుతో తన నెక్ట్స్ మూవీకి అప్పుడే శ్రీకారం కూడా చూట్టాడంటూ సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం ఒక కొత్త రైటర్ కథను అందించారు, ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమంతో లాంచ్ చేసి సెట్స్‌పైకి కూడా తీసుకువచ్చారని తెలుస్తోంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టారట. ఇక త్వరలోనే మంచి ముహుర్తం చూసుకుని ఈ సినిమాకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక హవీష్ కోనేరు గురించి ప్రత్యేకంగా పరియం అవసరం లేదు. నువ్విలా, జీనియస్, 7 వంటి చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందాడు. నువ్విలా సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అదే జానర్‌లో హావిష్ కోసం అవుట్ అండ్ అవుట్ కామెడీ కథను రెడీ చేశారట. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో ఆకట్టుకున్నాడు. దీంతో హవీష్ కోనేరు సరికొత్తగా కనిపించబోతున్నాడు. అతడి కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మొదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారట.