Posani Krishna Murali: పీఎస్‌కు సినీ నటుడు కృష్ణమురళి.. అరెస్ట్‌పై పోసాని భార్య సంచలన వ్యాఖ్యలు

Actor Posani Krishna Murali arrest police case filed: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆనాటి పెద్దలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, ప్రజలను రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో వీరంగం సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాయదుర్గం మైహోమ్ భూజా అపార్ట్మెంట్లో ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. ఆయనపై బీఎన్ఎస్లోని 196, 353(2), 111, రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అక్కడినుంచి ఆయనను అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వ వైద్యుడు గురుమహేశ్ ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన స్టేట్ మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేసుకున్నారు. కాగా, ఆయనను మరికాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో హాజరుపర్చనున్నారు.
పోసాని మురళీకృష్ణ అరెస్టుపై ఆయన భార్య స్పందించింది. మురళీ కృష్ణకు ఆరోగ్యం బాగాలేదని వెల్లడించింది. ఆస్పత్రికి వెళ్లి చూపించుకొని వస్తానని చెప్పినా కూడా వినిపించుకోలేదన్నారు. అంతేకాకుండా టాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పినా కూడా మేము అన్నీ చూసుకుంటామని పోలీసులు చెప్పారన్నారు. అయితే నోటీసులు తీసుకోమని అడిగితే మేము తీసుకోలేదన్నారు.
ఇదిలా ఉండగా, పోసాని తరపున వైసీపీ లీగల్ సెల్ లాయర్ నాగిరెడ్డి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోసాని కృష్ణమురళిని కలిసేందుకు పోలీస్ స్టేషన్‌కి వచ్చానని తెలిపారు. అయితే పోలీసులు ఆయనతో మాట్లాడేందుకు అనుమతి లేదని అంటున్నారన్నారు. పోసానిపై పెట్టిన కేసులన్నీ కోర్టులో కొట్టి వేయిస్తానని చెప్పారు. సాయంత్రం జడ్జి ఎదుట కూడా మా వాదనలు కూడా వినిపిస్తామన్నారు. పోలీసులు పోసాని కృష్ణ మురళిపై అక్రమ కేసులు పెట్టారని, ఆయనకు సాయంత్రం బెయిల్ వస్తుందని చెప్పారు.