AP Cabinet Sub Committee: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో..

Andhra Pradesh Cabinet Sub Committee: కేబినెట్ సబ్ కమిటీ భేటీ నేడు జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాసం కనిపిస్తోంది. దీంతో సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఏస్ఐపీబీ 7వ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 28, 546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి రెండో దశలో 44 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించే అంశంలో కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్ చర్చ జరగనుంది. కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.