Last Updated:

Sravana Sukravaram: శ్రావణ శుక్రవారం చేయకూడని పనులు ఏమిటో తెలుసా?

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక అటువంటి శుక్రవారం రోజున, అందునా శ్రావణ శుక్రవారం రోజున మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయి అని,

Sravana Sukravaram: శ్రావణ శుక్రవారం చేయకూడని పనులు ఏమిటో తెలుసా?

Sravana Sukravaram: శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక అటువంటి శుక్రవారం రోజున, అందునా శ్రావణ శుక్రవారం రోజున మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయి అని, ఒకవేళ అలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని చెబుతారు.

శుక్రవారం నాడు ఎట్టిపరిస్థితులలోనూ ఆలస్యంగా నిద్ర లేవ కూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు. శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితులలోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్లీ మళ్లీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. అదే విధంగా చిరిగిన బట్టలు ధరించటం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టు అవుతుంది. శుక్రవారం నాడు ఇంట్లో మహిళలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఏడవకూడదు. అలా ఏడిస్తే ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది.

ఇక ఇళ్ళలో పనిచేయని గడియారాలు, పగిలిపోయిన అద్దాలను ఉంచుకోవడం అనర్థాలకు కారణమౌతుంది. అంతేకాదు శుక్రవారం నాడు ప్రతి ఒక్కరు మనసును అమ్మవారిని ధ్యానం చేయడం పైనే లగ్నం చెయ్యాలి కానీ, శుక్రవారం నాడు ఎవరినీ నిందించకూడదు. ఇంట్లో తమ కుటుంబ సభ్యులను కూడా శుక్రవారం నాడు తిట్టకూడదు. తోడబుట్టిన వారిని ఆదరంగా చూడాలి. వారి మనసును కష్టపెట్టకుండా ఉండాలి. శుక్రవారం నాడు నోరు లేని మూగ జీవాలను కొట్టరాదు. నోరు లేని మూగ జీవాలకు, నిరుపేదలకు తమ వంతు సహాయం అందిస్తే లక్ష్మీదేవి కృప ఖచ్చితంగా వారిపై ఉంటుందని చెబుతారు

ఇవి కూడా చదవండి: