Published On:

Vastu Tips for Money: ఇంట్లో ఈ దిక్కున డబ్బు దాచితే.. రెట్టింపు అవుతుంది!

Vastu Tips for Money: ఇంట్లో ఈ దిక్కున డబ్బు దాచితే.. రెట్టింపు అవుతుంది!

Vastu Tips for Money: ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు, వాస్తు శాస్త్రంలో దిశ నిర్ణయించబడింది. వాస్తు ప్రకారం వస్తువులను సరైన దిశలో ఉంచినట్లయితే ఇంటి వాస్తు చాలా మంచిదని పరిగణించబడుతుంది. ఇది ఎల్లప్పుడూ ఇంట్లో సానుకూల శక్తిని సృష్టిస్తుంది. మరోవైపు ఇంట్లో వస్తువులు వాస్తు ప్రకారం లేకపోతే, ప్రతికూల శక్తి, అశాంతి, ధన నష్టం జరుగుతుంది. ఈ విధంగా వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు భద్రంగా ఉంచడానికి సరైన స్థలం ఉండటం చాలా ముఖ్యం.

వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బులు ఉంచినట్లయితే సంపద నిరంతరం పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దీనికి విరుద్ధంగా.. మీరు డబ్బును తప్పుడు స్థలంలో ఉంచడం వల్ల డబ్బు నష్టం.. అనవసరమైన ఖర్చులు, మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో..

 

ఇంట్లో డబ్బు దాచడానికి సరైన దిశ:

ఇంట్లో డబ్బు భద్రంగా ఉంచడానికి ఉత్తర దిశ ఉత్తమమైంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశ సంపదకు అధిపతి అయిన కుబేరుడికి చెందినది. డబ్బును ఉత్తర దిశలో బీరువాలో ఉంచినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఉత్తర దిశలో ఉండే బీరువా తలుపులు దక్షిణ దిశలో తెరుచుకుంటాయి. ఈ దిశ మీ సంపద నిరంతరం పెరుగడానికి ఉపయోగపడుతుంది.
ప్రకటన

 

పొరపాటున కూడా దక్షిణ దిశలో డబ్బు ఉంచకూడదు:

వాస్తు ప్రకారం.. దక్షిణ దిశలో డబ్బును దాచడం ధన నష్టం జరుగుతుంది. అంతే కాకుండా వాస్తు దోషాలు ఏర్పడతాయి. నిజానికి, దక్షిణ దిశను యమరాజు దిశగా పరిగణిస్తారు. అందుకే తెలిసి లేదా తెలియకుండా పొరపాటున కూడా ఈ దిశలో డబ్బును ఉంచకూడదు.

 

తూర్పు దిశలో బీరువా:

కొన్నిసార్లు బీరువాను ఉత్తర దిశలో ఉంచడం సాధ్యం కాదు. అప్పుడు తూర్పు దిశ వైపు ఉంచవచ్చు. తూర్పు దిశను సూర్య భగవానుని దిశగా భావిస్తారు. దీనివల్ల ఆర్థిక లాభం, పురోగతి, పనిలో విజయం లభిస్తాయి.

 

మరికొన్ని కొన్ని వాస్తు నియమాలు:

చాలాసార్లు కష్టపడి పనిచేసినప్పటికీ.. డబ్బు ఆదా కాకపోతే లేదా బరువాలో ఉంచిన డబ్బు నిలవకపోతే అది వాస్తు సంబంధమైన లోపం వల్ల కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు బీరువాలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిపై బియ్యం గింజలు, వెండి నాణెం ఉంచాలి.

 

అనవసరమైన వస్తువులను బీరువా చుట్టూ ఉంచితే.. అది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో సంపదను వృద్ధి చేసుకోవడానికి మీరు డబ్బు దాచే స్థలం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. అంతే కాకుండా అక్కడ సువాసనగల ధూపం కర్రలు, దీపాలను వెలిగించండి.

 

పాత బిల్లులు, పనికిరాని పేపర్‌లుు లేదా విరిగిన వస్తువులను బీరువాలో ఉంచడం వల్ల డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

బీరువా రంగు లేత పసుపు, తెలుపు లేదా క్రీమ్ అయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇదిలా ఉంటే బీరువాను క్రమం తప్పకుండా శుభ్రం చేసి, దానిలో సువాసనగల ధూపం వేయండి. బీరువా తలుపు మీద ఎరుపు రంగు స్వస్తిక్ గుర్తును వేయండి. ఇది సంపదను పెంచుతుంది.